HS Prannoy : ఆస్ట్రేలియా ఓపెన్ రన్నరప్‌గా హెచ్ఎస్ ప్రణయ్.. ఫైనల్‌లో చైనా ప్లేయర్ చేతిలో పోరాడి ఓటమి
ఆస్ట్రేలియా ఓపెన్ (Australia Open 2023) పురుషుల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్‌లో భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్(HS Prannoy) పోరాడి ఓడిపోయాడు. రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్నాడు.

HS Prannoy
Shuttler HS Prannoy : ఆస్ట్రేలియా ఓపెన్ (Australia Open 2023) పురుషుల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్‌లో భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్(HS Prannoy) పోరాడి ఓడిపోయాడు. రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్నాడు. ఆదివారం చైనాకు చెందిన వెంగ్ హాంగ్ యాంగ్(Weng Hongyang)తో ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో ప్రణయ్ 9-21, 23-21, 20-22 తేడాతో ఓడిపోయాడు. దీంతో వరుసగా రెండవ సారి బీడబ్ల్యూఎఫ్(BWF) టైటిల్‌ను గెలుచుకునే అవకాశాన్ని తృటిలో కోల్పోయాడు.
90 నిమిషాల పాటు మ్యాచ్ సాగింది. తొలి సెట్ ఓడి వెనుకబడిన ప్రణయ్ రెండో సెట్‌లో అద్భుతంగా పుంజుకుని విజయం సాధించాడు. దీంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఇక మూడో సెట్‌లో ఇరువురు ఆటగాళ్లు నువ్వానేనా అన్నట్లుగా పోరాడారు. ఓ దశలో 19-17తో ప్రణయ్ ముందంజలో నిలిచాడు. అయితే వాంగ్ అద్వితీయంగా పుంజుకున్నాడు. దీంతో స్కోర్ 20-20తో సమమైంది. ఈ దశలో ప్రణయ్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా వాంగ్ వరుసగా రెండు పాయింట్లు గెలిచి ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా నిలిచాడు.
ఈ సీజన్‌లో ప్రణయ్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవలే మలేషియా ఓపెన్(Malaysia Open) టైటిల్‌ను గెలిచాడు. ఆ ఫైనల్ మ్యాచ్‌లో హాంగ్‌యాంగ్ పై 21-19, 13-21, 21-18 తేడాతో గెలిచాడు.
A remarkable run at #AustraliaOpen2023 comes to an end for Prannoy?. Well done champ we’re proud of you ?✨
?: @badmintonphoto#AustraliaOpen2023#IndiaontheRise#Badminton pic.twitter.com/AsTfyRfcs8
— BAI Media (@BAI_Media) August 6, 2023