Ashes : స్టీవ్ స్మిత్ రికార్డు సెంచ‌రీ.. రెండో టెస్టు మొద‌టి ఇన్నింగ్స్‌లో ఆసీస్ ఆలౌట్‌

యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో లార్డ్స్‌లో జ‌రుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా జ‌ట్టు మొద‌టి ఇన్నింగ్స్‌లో 416 ప‌రుగుల‌కు ఆలౌటైంది.

Steve Smith

Ashes ENG vs AUS : యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో లార్డ్స్‌లో జ‌రుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా జ‌ట్టు మొద‌టి ఇన్నింగ్స్‌లో 416 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ఆసీస్ బ్యాట‌ర్ల‌లో స్టీవ్ స్మిత్ (110) శ‌త‌కంతో అల‌రించ‌గా ట్రావిస్ హెడ్ (77), డేవిడ్ వార్న‌ర్ (66) అర్ధ‌శ‌త‌కాల‌తో రాణించారు. ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌లో జోష్ టంగ్, ఓలీ రాబిన్సన్ లు చెరో మూడు వికెట్లు తీయ‌గా, జో రూట్ రెండు, జేమ్స్ అండ‌ర్స‌న్‌, బ్రాడ్‌లు త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

Virender Sehwag : సెమీస్‌లో ఆ రెండు జ‌ట్లు ఖ‌చ్చితంగా ఉంటాయి.. అయితే అవి భార‌త్‌, పాకిస్తాన్ కాదు

77 ప‌రుగులు 5 వికెట్లు

ఓవ‌ర్ నైట్ స్కోరు 339/5 తో రెండో రోజు ఆట‌ను ప్రారంభించిన ఆస్ట్రేలియా మ‌రో 77 ప‌రుగులు జోడించి మిగిలిన ఐదు వికెట్లు కోల్పోయింది. ఆట ఆరంభ‌మైన కాసేప‌టికే అలెక్స్ కేరీ(22) ని సువ‌ర్ట్ బ్రాడ్ ఎల్భీగా పెవిలియ‌న్‌కు పంపాడు. మ‌రికాసేప‌టికే మిచెల్ స్టార్క్‌(6) కూడా ఔట్ కావ‌డంతో స్మిత్ సెంచ‌రీ చేస్తాడా లేదా అన్న అనుమానం క‌లిగింది. అయితే.. కెప్టెన్ క‌మిన్స్‌(22) అండ‌గా నిల‌వ‌డంతో స్మిత్ 169 బంతుల్లో టెస్టుల్లో 32 సెంచ‌రీని పూర్తి చేశాడు. శ‌త‌కం పూరైన కాసేప‌టికే స్మిత్‌ను ఔట్ అయ్యాడు. దీంతో ఆస్ట్రేలియా 393 ప‌రుగుల వ‌ద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయింది. ఆ త‌రువాత ఆసీస్ ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎంతో స‌మ‌యం ప‌ట్ట‌లేదు.

అత్యంత వేగంగా 32 సెంచ‌రీలు చేసిన ఆట‌గాడిగా

తాజాగా శ‌త‌కం స్టీవ్ స్మిత్ టెస్టు కెరీర్‌లో 32వ ది. టెస్టుల్లో ఆస్ట్రేలియా త‌రుపున అత్య‌ధిక శ‌త‌కాలు చేసిన ఆట‌గాళ్ల జాబితాలో రికీ పాంటింగ్ (41) అగ్ర‌స్థానంలో ఉండ‌గా స్టీవ్ వా తో క‌లిసి స్మిత్ సంయుక్తంగా రెండో స్థానంలో కొన‌సాగుతున్నాడు. కాగా.. టెస్టుల్లో అత్య‌ధిక వేగంగా 32 సెంచ‌రీలు చేసిన ఆట‌గాళ్ల జాబితాలో స్మిత్ అగ్ర‌స్థానంలో నిలిచాడు.

Ashes : ప్రారంభ‌మైన యాషెస్ రెండో టెస్టు.. ఊహించ‌ని ప‌రిణామం.. ఆందోళ‌న కారుడిని ఎత్తి ప‌డేసిన బెయిర్ స్టో

ఓవ‌రాల్‌గా టెస్టుల్లో అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన ఆట‌గాళ్ల జాబితాలో భార‌త దిగ్గ‌జ ఆట‌గాడు మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ (51) మొద‌టి స్థానంలో ఉన్నాడు. ఆ త‌రువాత ద‌క్షిణాఫ్రికా ఆట‌గాడు జాక్ క‌లీస్ (45), రికీ పాంటింగ్ (41) లు త‌రువాతి స్థానాల్లో ఉన్నారు.

TNPL : మైండ్ ఎక్క‌డ పెట్టార‌య్యా..! ర‌నౌట్ అయినా ప‌ట్టించుకోలే.. బ్యాట‌ర్ బ‌చ్‌గ‌యా