IPL 2024 : ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డులు నమోదు చేసిన సన్‌రైజ‌ర్స్ హైదరాబాద్ జ‌ట్టు.. అవేమిటంటే?

ఐపీఎల్ 2024 టోర్నీలో భాగంగా బుధవారం రాత్రి ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో రికార్డుల మోత మోగింది.

MI Vs SRH Match : ఐపీఎల్ చరిత్రలోసరికొత్త రికార్డు నమోదైంది. ఐపీఎల్ 2024 టోర్నీలో భాగంగా బుధవారం రాత్రి ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో రికార్డుల మోత మోగింది. సిక్స్ లు, ఫోర్లతో ఇరు జట్ల బ్యాటర్లు విరుచుకుపడటంతో హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం దద్దరిల్లిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు స్కోర్ నమోదు చేసింది. ఆ జట్టు బ్యాటర్లు మ్యాచ్ ప్రారంభం నుంచి చివరి వరకు సిక్సర్ల మోత మోగించారు. దీంతో కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి సన్‌రైజర్స్ జట్టు 277 పరుగులు చేసింది.

Also Read : IPL 2024 : రోహిత్ శర్మ ఔట్ అవ్వగానే కావ్య పాప సూపర్ డ్యాన్స్.. వీడియోలు వైరల్

సన్‌రైజర్స్ జట్టులో మయాంక్ మినహా మిగిలిన బ్యాటర్లు పరుగుల వరద పారించారు. మయాంక్ (11) ఔట్ కాగా, అభిషేక్ శర్మ కేవలం 23 బంతుల్లో 63 పరుగులు చేయగా.. ట్రావిస్ హెడ్ 24 బంతుల్లో 62 పరుగులు చేశాడు. ఆ తరువాత హెన్రిచ్ క్లాసెన్, మార్ క్రమ్ లు ముంబై బౌలర్లకు చుక్కలు చూపించారు. మార్ క్రమ్ 42 నాటౌట్, క్లాసెన్ కేవలం 34 బంతుల్లో 80 పరుగుల చేసి నాటౌట్ గా నిలిచాడు. ముగ్గురు బ్యాటర్లు అర్ధ సెంచరీలతో ముంబై బౌలర్లపై విరుచుకు పడటంతో నిర్ణీత 20 ఓవర్లలో సన్‌రైజర్స్ జట్టు 277 పరుగులు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే ఓ జట్లు నమోదు చేసిన అత్యధిక స్కోర్ ఇదే కావటం గమనార్హం.

Also Read : హైదరాబాద్ బోణీ.. ముంబైపై గ్రాండ్ విక్టరీ

  • రికార్డుల మోత..
    తొలి 10 ఓవర్లలో సన్‌రైజర్స్ బ్యాటర్లు 148 పరుగులు చేయడంతో గత రికార్డు బద్దలైంది. 2014లో పంజాబ్, 2021లో ముంబయి జట్లు తొలి 10 ఓవర్లలో 131 పరుగులు చేశాయి. ఆ రికార్డును సన్‌రైజర్స్ జట్టు అధిగమించింది.
  • ముంబైపై సన్‌రైజర్స్ జట్టు చేసిన 277 పరుగులు ఐపీఎల్ చరిత్రలోనే ఓ జట్టు అత్యధిక స్కోర్. 2013లో పుణె వారియర్స్ పై ఆర్సీబీ జట్టు ఐదు వికెట్లు కోల్పోయి 263 పరుగులు చేసింది. ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ఆ రికార్డును సన్‌రైజర్స్ జట్టు బ్రేక్ చేసింది. కేవలం మూడు వికెట్లు కోల్పోయి 277 పరుగులు చేసింది.
  • 2013 ఏప్రిల్ 23న ఆర్సీబీ జట్టు ప్లేయర్ క్రిస్ గేల్ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో గేల్ ఒక్కడే 175 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. దీంతో అప్పుడు ఆర్సీబీ జట్టు 263 పరుగులు చేసింది. ప్రస్తుతం రికార్డును సన్‌రైజర్స్ జట్టు బ్రేక్ చేసింది.
  • ఉప్పల్ లో జరిగిన ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో 523 పరుగులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఐపీఎల్ మ్యాచ్ లలో ఇరు జట్ల స్కోర్ 500 స్కోర్ తాకలేదు. ఐపీఎల్ ఓ మ్యాచ్ లో అత్యధిక పరుగుల రికార్డు ఇదే.
  • 2010 ఏప్రిల్ 3న చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో మొత్తం 469 పరుగులు నమోదయ్యాయి. 14ఏళ్ల రికార్డు ఉప్పల్ స్టేడియంలో జరిగిన ముంబై వర్సెస్ సన్‌రైజర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో బ్రేక్ అయింది. ఈ మ్యాచ్ లో ఇరు జట్లు కలిపి 523 పరుగులు చేశాయి.
  • సన్‌రైజర్స్ బ్యాటర్ అభిషేక్ శర్మ 16 బంతుల్లోనే అర్థశతకం పూర్తి చేశాడు. సన్‌రైజర్స్ తరపున ఐపీఎల్ లో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన బ్యాటర్ అభిషేక్ శర్మనే.
  • ఓ ఐపీఎల్ మ్యాచ్ లో ఒకే జట్టు నుంచి 20 బంతుల్లోపే అర్ధశతకాలు పూర్తిచేసుకున్న తొలి ద్వయంగా హెడ్ – అభిషేక్ నిలిచారు.
  • ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో 38 సిక్సర్లు నమోదయ్యాయి. ఓ ఐపీఎల్ మ్యాచ్ లో అత్యధిక సిక్సర్లు రికార్డు ఇదే. గతంలో ఆర్సీబీ 33 సిక్సర్ల రికార్డు బద్దలైంది.
  • ఐపీఎల్ లో అరంగ్రేట మ్యాచ్ లో అత్యధిక పరుగులు ఇచ్చుకున్న వ్యక్తి ముంబై జట్టు పేసర్ మపాక. అతను నాలుగు ఓవర్లు వేసి 66 పరుగులు సమర్పించుకున్నాడు.

Also Read : IPL 2024 : ధోనీ అద్భుత క్యాచ్.. ఒక్కసారిగా హోరెత్తిన స్టేడియం.. సురేశ్ రైనా ఏమన్నాడంటే?

 

ట్రెండింగ్ వార్తలు