బాల్కనీ బాగాలేదనే రైనా వచ్చేశాడా.. విజయం తలకెక్కిందంటూ సూపర్ కింగ్స్ యజమాని కామెంట్లు

చెన్నై సూపర్ కింగ్స్ సీనియర్ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా సడన్‌గా ఇండియాకు తిరిగి రావడంపై యజమాని శ్రీనివాసన్ ఘాటుగా స్పందించారు. ఐపీఎల్ నుంచి పర్సనల్ రీజన్స్ రీత్యా వెళ్లిపోతున్నాడని తెలిసిన రైనా ఇండియా రిటర్న్ వెనుక వేరే కారణం ఉన్నట్లు తెలుస్తుంది. ‘సీజన్ ఇంకా ఆరంభం కాలేదు రైనా కచ్చితంగా రియలైజ్ అవుతాడు. తానెంత మనీ మిస్ అయ్యాడో.. సీజన్ కు వచ్చే పదకొండు కోట్ల రూపాయలు అతను కోల్పోతాడు’ అని శ్రీనివాసన్ చెప్పారు.
జట్టులో ఇప్పటికే ఇద్దరు క్రికెటర్లు కరోనాతో బాధపడుతుండటంతో రైనా సడన్ డెసిషన్ పై శ్రీనివాసన్ ఇలా ఘాటుగా రెస్పాండ్ అయ్యారు. యూఏఈలో జరుగుతున్న 13వ సీజన్ పై చెన్నై ఓనర్ ఇలా అన్నారు. ఇంకా ఎవరికైనా నచ్చకపోతే.. వెళ్లిపోవచ్చు. ఎవర్నీ బలవంతం చేయం. ‘మీరు హ్యాపీగా లేకపోతే వెనక్కు వెళ్లిపోవచ్చు. ఇంకేదైనా చేయడానికి నేనేం ఫోర్స్ చేయను. కొన్ని సార్లు విజయగర్వం తలకెక్కొచ్చు’ అని అన్నారు.
రిపోర్టుల ప్రకారం.. రైనా వెళ్లిపోయింది హోటల్ రూం నచ్చపోవడంతో అంటున్నారు. ఆగష్టు 21 తర్వాత దుబాయ్ కు చేరుకున్న రైనాకు మంచి రూం ఇవ్వలేదట. సరైన బాల్కనీ కూడా లేదట. కఠినంగా ఉన్న బయో సెక్యూర్ వాతావరణంలో క్లాస్ట్రోఫోబిక్ గా ఫీలయ్యేలా చేసుండొచ్చని అంటున్నారు.
‘చెన్నై సూపర్ కింగ్స్ అనేది ఎప్పుడూ ఒక కుటుంబంలా ఉంటుంది. సీనియర్ ప్లేయర్లతో కలిసి మిగిలిన వాళ్లు నేర్చుకుంటారు. కానీ, క్రికెటర్లు పాత కాలం హీరోల్లా టెంపరమెంట్
చూపించుకుంటున్నారు’ అని శ్రీనివాసన్ అన్నారు.
ఇంకొందరేమో.. రైనా తన అంకుల్ చనిపోవడంతో బాధలో వెళ్లిపోయినట్లు చెబుతుంటే.. మరికొందరు సీఎస్కే జట్టులో కొందరికి కరోనా పాజిటివ్ వచ్చిందని.. అదే తనని ఇన్ సెక్యూర్ గా ఫీలయ్యేలా చేసిందని అందుకే వెళ్లిపోయాడని చెబుతుననారు. నిజమైన కారణం ఇంకా తెలియరాలేదు.