Suryakumar Yadav completed 9000 T20 runs becomes 3rd fastest Indian to do
Suryakumar Yadav : టీమ్ఇండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అరుదైన ఘనతను సాధించాడు. టీ20 క్రికెట్‌లో 9 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. నాగ్‌పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో 24 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్స్ సాయంతో 32 పరుగులు చేయడం అతడు ఈ మైలురాయిని అందుకున్నాడు. టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా (ఇన్నింగ్స్‌ల పరంగా) ఈ ఘనత సాధించిన భారత ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు.
టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా 9 వేల పరుగుల మైలురాయిని చేరుకున్న భారత ఆటగాడిగా విరాట్ కోహ్లీ ఉన్నాడు. 271 ఇన్నింగ్స్‌ల్లో కోహ్లీ ఈ మైలురాయిని చేరుకున్నాడు. ఆ తరువాతి స్థానంలో శిఖర్ ధావన్ ఉన్నాడు. అతడు 308 ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించాడు. ఇక సూర్య విషయానికి వస్తే 321 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని చేరుకున్నాడు.
* విరాట్ కోహ్లీ – 271 ఇన్నింగ్స్‌లు
* శిఖర్ ధావన్ – 308 ఇన్నింగ్స్‌లు
* సూర్యకుమార్ యాదవ్ – 321 ఇన్నింగ్స్
* రోహిత్ శర్మ – 329 ఇన్నింగ్స్
ఇక ఓవరాల్‌గా టీ20ల్లో అత్యంత వేగంగా 9 వేల పరుగుల మైలురాయిని చేరుకున్న రికార్డు పాకిస్తాన్ ఆటగాడు బాబర్ ఆజామ్ పేరిట ఉంది. బాబర్ 245 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు.
ఇక భారత్, న్యూజిలాండ్ మొదటి టీ20 మ్యాచ్ విషయానికి వస్తే.. అభిషేక్ శర్మ (35 బంతుల్లో 84 పరుగులు), రింకూ సింగ్ 20 బంతుల్లో 44 నాటౌట్) దంచికొట్టడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బౌలర్లలో జాకబ్ డఫీ, కైల్ జేమీసన్ లు చెరో రెండు వికెట్లు పడగొట్టాడు. క్రిస్టియన్ క్లార్క్, ఇష్ సోధి, మిచెల్ సాంట్నర్ తలా ఓ వికెట్ తీశారు.
🚨 9000 RUNS FOR SURYAKUMAR YADAV IN T20 🚨
– One of the best in this format. pic.twitter.com/LJYCnnE7y5
— Johns. (@CricCrazyJohns) January 21, 2026
ఆ తరువాత గ్లెన్ ఫిలిప్స్ (40 బంతుల్లో 78 పరుగులు), మార్క్ చాప్‌మన్ (24 బంతుల్లో 39 పరుగులు) రాణించినప్పటికి మిగిలిన వారు విఫలం కావడంతో 239 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 190 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, శివమ్ దూబె లు చెరో రెండు వికెట్లు సాధించగా హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్ లు తలా ఓ వికెట్ తీశారు.