IND vs NZ : మ్యాచ్ గెలిచినా అదొక్క‌టే లోటు.. హోటల్‌లో, టీమ్ బస్సులో ఉన్నప్పుడు కూడా.. సూర్య‌కుమార్ యాద‌వ్ కామెంట్స్‌..

మ్యాచ్ అనంత‌రం (IND vs NZ ) భార‌త కెప్టెన్ సూర్యకుమార్ యాద‌వ్ మాట్లాడుతూ గెల‌వ‌డం ప‌ట్ల ఆనందాన్ని వ్య‌క్తం చేశాడు

IND vs NZ : మ్యాచ్ గెలిచినా అదొక్క‌టే లోటు.. హోటల్‌లో, టీమ్ బస్సులో ఉన్నప్పుడు కూడా.. సూర్య‌కుమార్ యాద‌వ్ కామెంట్స్‌..

Suryakumar Yadav Comments after India won the 1st T20 against New Zealand

Updated On : January 22, 2026 / 8:22 AM IST
  • తొలి టీ20 మ్యాచ్‌లో కివీస్ పై విజ‌యం
  • భార‌త కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ కామెంట్స్‌
  • మంచు ప్ర‌భావం ఉన్నా ల‌క్ష్యాన్ని కాపాడుకోవ‌డం బాగుంది

న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భార‌త్ శుభారంభం చేసింది. నాగ్‌పూర్ వేదిక‌గా జ‌రిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భార‌త్ 48 ప‌రుగుల తేడాతో విజ‌యాన్ని సాధించింది. మంచు ప్ర‌భావం ఉన్న‌ప్ప‌టికి కూడా ల‌క్ష్యాన్ని కాపాడుకోవ‌డం బాగుంద‌ని టీమ్ఇండియా టీ20 కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ తెలిపాడు. తాము ఫీల్డింగ్‌లో ఇంకాస్త మెరుగు అవ్వాల్సి ఉంద‌న్నాడు.

అభిషేక్‌ శర్మ (84; 35 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స‌ర్లు), రింకూ సింగ్‌ (44 నాటౌట్‌; 20 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) లు మెరుపులు మెరిపించ‌డంతో తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 238 ప‌రుగులు చేసింది. మిగిలిన భార‌త బ్యాట‌ర్ల‌లో సూర్యకుమార్‌ (32; 22 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌), హార్దిక్‌ పాండ్య (25; 16 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) లు రాణించారు. కివీస్ బౌల‌ర్ల‌లో జాకబ్ డఫీ, కైల్ జేమీసన్ లు చెరో రెండు వికెట్లు తీయ‌గా.. క్రిస్టియన్ క్లార్క్, ఇష్ సోధి, మిచెల్ సాంట్నర్ త‌లా ఓ వికెట్ సాధించారు.

Shreyanka Patil : ఆర్‌సీబీ ప్లేయ‌ర్ శ్రేయాంక పాటిల్ ఫోటోలు వైర‌ల్‌

అనంత‌రం గ్లెన్‌ ఫిలిప్స్‌ (78; 40 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స‌ర్లు), మార్క్ చాప్‌మ‌న్ (39; 24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) రాణించిన‌ప్ప‌టికి మిగిలిన వారు విఫ‌లం కావ‌డంతో 239 ప‌రుగుల భారీ ల‌క్ష్య ఛేద‌న‌లో న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 190 ప‌రుగులకే పరిమిత‌మైంది. భార‌త బౌల‌ర్ల‌లో వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, శివ‌మ్ దూబె లు చెరో రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. హార్దిక్ పాండ్యా, అక్ష‌ర్ ప‌టేల్‌, అర్ష్‌దీప్ సింగ్ లు త‌లా ఓ వికెట్ తీశారు.

ఇక మ్యాచ్ అనంత‌రం భార‌త కెప్టెన్ సూర్యకుమార్ యాద‌వ్ మాట్లాడుతూ గెల‌వ‌డం ప‌ట్ల ఆనందాన్ని వ్య‌క్తం చేశాడు. తొ’లుత బ్యాటింగ్ చేసి భారీగా ప‌రుగులు సాధించ‌డం ఎల్ల‌ప్పుడూ మంచిద‌ని నేను భావిస్తాను. ఆ త‌రువాత మంచు ప్ర‌భావం ఉన్న‌ప్ప‌టికి కూడా ల‌క్ష్యాన్ని కాపాడుకోవ‌డం ఎంతో బాగుంది. ఇది పెద్ద సానుకూలాంశం అని నేను అనుకుంటున్నాను.’ సూర్య తెలిపాడు.

ఇక‌పై ఇదే కాంబినేష‌న్‌తో ఆడ‌తాం

ఇక ఈ మ్యాచ్‌లో త‌మ జ‌ట్టు బ్యాటింగ్ చేసిన విధానం బాగుంద‌న్నాడు. ప‌వ‌ర్ ప్లేలో 25 ప‌రుగుల‌కే రెండు వికెట్లు కోల్పోయిన‌ప్ప‌టికి కూడా 15వ ఓవ‌ర్ వ‌ర‌కు కూడా నిల‌క‌డ‌గా ఆడామ‌ని చెప్పాడు. ఆ త‌రువాత కూడా బ్యాట‌ర్లు త‌మ జోరును కొన‌సాగించార‌న్నాడు.

KKR : కేకేఆర్ ఫీల్డింగ్ కోచ్‌గా దిశాంత్ యాగ్నిక్‌..

ఇక ఈ మ్యాచ్‌లో భార‌త్ 8 మంది బ్యాట‌ర్లు ముగ్గురు ప్ర‌ధాన బౌల‌ర్లతో బ‌రిలోకి దిగింది. ఇక ఇదే ప‌ద్ద‌తిని త‌రువాత మ్యాచ్‌ల్లోనూ కొన‌సాగిస్తారా అనే ప్ర‌శ్న సూర్య‌కు ఎదురైంది. దీనిపై అత‌డు మాట్లాడుతూ.. ఈ కాంబినేష‌న్ బాగుంద‌న్నాడు. ఓ జ‌ట్టుగా ఇది వ‌ర్కౌట్ అవుతోంది. కాబ‌ట్టి దీనినే కొన‌సాగిస్తామ‌న్నాడు. ఇక త‌న బ్యాటింగ్ గురించి మ‌ట్లాడుతూ.. ఎంతో ఆస్వాదించాన‌ని అన్నాడు.

తాను బ్యాటింగ్‌కు వెళ్లే స‌రికి ఒత్తిడి ఉంద‌ని, తాను ఇలాంటి ప‌రిస్థితుల్లో ఎన్నో సార్లు ఆడిన‌ట్లుగా గుర్తు చేసుకున్నాడు. గ‌తంలో తాను చెప్పిన‌ట్లుగా నెట్స్‌లో చాలా బాగా ఆడుతున్నాన‌ని అన్నాడు. మ్యాచ్‌లో కొన్ని బంతులు ఎదుర్కొన్న త‌రువాత స‌హ‌జ శైలిలో ఆడిన‌ట్లు తెలిపాడు. మ్యాచ్‌లో ఎక్కువ‌గా ఆఫ్ సైడ్ ఆడ‌డం గురించి మాట్లాడుతూ.. అది స‌హ‌జంగానే జ‌రిగింద‌న్నాడు.

ఇక ఫీల్డింగ్ గురించి మాట్లాడుతూ.. ఈ విభాగంలో తాము ఇంకాస్త మెరుగుప‌డాల్సి ఉంద‌న్నాడు. మంచు ప్ర‌భావం ఉన్న‌ప్పుడు కొన్ని త‌ప్పిదాలు జ‌రుగుతాయ‌ని, అందుక‌నే తాను ఆట‌గాళ్ల‌కు మ‌ద్ద‌తుగా ఉంటాన‌న్నాడు. మైదానంలో అడుగుపెట్టే ప్ర‌తీసారి సారి తాము మెరుగ్గా ఆడేందుకే ప్ర‌య‌త్నిస్తామ‌ని చెప్పాడు.

IND vs NZ : అందుకే ఓడిపోయాం.. ప్రాక్టీస్ అదిరిపోయింది.. ఇక ముందుంది చూడు.. న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్న‌ర్ కామెంట్స్‌..

ఇక యువ ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ గురించి మాట్లాడుతూ.. అత‌డు మ్యాచ్‌కు సిద్ద‌మయ్యే విధానం అద్భుతం అని చెప్పాడు. అత‌డు బ్యాటింగ్ తీరు మాత్ర‌మే కాద‌ని, అత‌డు త‌న‌ను తాను సిద్ధం చేసుకునే విధానం చాలా బాగుంటుంద‌న్నాడు. హోటల్‌లో ఉన్నప్పుడు, టీమ్ బస్సులో ఉన్నప్పుడు అతను ప్రవర్తించే విధానం, ఆ చిన్న చిన్న విషయాలన్నీ మైదానంలో ప్రతిబింబిస్తాయి. అత‌డు త‌న క‌ష్టానికి త‌గిన ప్ర‌తిఫ‌లం అందుకుంటున్నాడు. అని సూర్య తెలిపాడు.