Suryakumar Yadav need 50 runs to break David Miller record in t20s
Suryakumar Yadav : సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని భారత జట్టు ఆసియాకప్ 2025లో అదరగొడుతోంది. వరుస విజయాలతో సూపర్ 4కి దూసుకువెళ్లింది. గ్రూప్ దశలో చివరి మ్యాచ్ సెప్టెంబర్ 19న ఒమన్‌తో ఆడనుంది. కాగా.. ఈ మ్యాచ్‌కు ముందు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను ఓ రికార్డు ఊరిస్తోంది.
టీమ్ఇండియా తరుపున ఇప్పటి వరకు సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) ఇప్పటి వరకు 85 మ్యాచ్‌లు ఆడాడు. 166.37 స్ట్రైక్‌రేటుతో 2652 పరుగులు చేశాడు. టీ20 క్రికెట్ చరిత్రలో నాన్ ఓపెనర్‌గా అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో సూర్య ప్రస్తుతం ఐదో స్థానంలో ఉన్నాడు.
సూర్య తన కెరీర్‌లో నాలుగు మ్యాచ్‌ల్లో ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. 25 సార్లు మూడో స్థానంలో, 46 సార్లు నాలుగో స్థానంలో, ఐదో స్థానంలో ఆరు సార్లు బరిలోకి దిగాడు. ఓపెనర్‌గా కాకుండా 2517 పరుగులు చేశాడు.
టీ20 క్రికెట్‌లో నాన్ ఓపెనర్ జాబితాలో అత్యధిక పరుగులు సాధించిన రికార్డు ప్రస్తుతం టీమ్ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరిట ఉంది. నాన్ ఓపెనర్‌గా కోహ్లీ 3637 పరుగులు చేశాడు. ఆ తరువాత డేవిడ్ మిల్లర్, షకీబ్ అల్ హసన్, గ్లెన్ మాక్స్‌వెల్, సూర్యకుమార్ యాదవ్‌లు ఉన్నారు.
ఒమన్‌తో మ్యాచ్‌లో సూర్య 51 పరుగులు చేస్తే ఈ జాబితాలో రెండో స్థానానికి చేరుకుంటాడు. మిల్లర్‌కు అతడికి మధ్య కేవలం 50 రన్స్ అంతరం మాత్రమే ఉంది.
టీ20ల్లో నాన్ ఓపెనర్‌గా అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే..
* విరాట్ కోహ్లీ (భారత్) – 3637 పరుగులు
* డేవిడ్ మిల్లర్ (దక్షిణాప్రికా)- 2567 పరుగులు
* షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్) – 2542 పరుగులు
* గ్లెన్ మాక్స్‌వెల్ (ఆస్ట్రేలియా) – 2535 పరుగులు
* సూర్యకుమార్ యాదవ్ (భారత్) – 2517 పరుగులు