Shahid Afridi : భారత్ చేతిలో ఓటమి.. ‘అల్లుడూ.. బ్యాటింగ్ కాదు.. బౌలింగ్ బాగా చేయ్..’ షాహిద్ అఫ్రిది కామెంట్స్ వైరల్..
ఆసియాకప్‌లో భారత్ చేతిలో పాక్ చిత్తు చిత్తుగా ఓడిపోయింది. దీనిపై పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది (Shahid Afridi) స్పందించాడు.

Asia Cup 2025 IND vs PAK Afridi slammed his own son in law Shaheen
Shahid Afridi : ఆసియాకప్ 2025లో భాగంగా ఆదివారం (సెప్టెంబర్ 14న) భారత్, పాక్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. పాక్ జట్టు చిత్తు చిత్తుగా ఓడిపోవడంపై ఆ దేశ మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది (Shahid Afridi) మండిపడుతున్నాడు. తన అల్లుడు షాహీన్ అఫ్రిది బంతితో పేలవ ప్రదర్శన చేసినందుకు అతడిని విమర్శించాడు.
ఈ మ్యాచ్‌లో షాహీన్ బ్యాటింగ్‌లో అదరగొట్టాడు. 16 బంతుల్లో 4 సిక్సర్లు బాది 33 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడు బ్యాటింగ్‌లో రాణించడం వల్ల పాక్ స్కోరు 100 పరుగుల మార్క్‌ను దాటింది. అయితే.. బౌలింగ్‌లో షాహీన్ ఘోరంగా విఫలం అయ్యాడు. రెండు ఓవర్లు వేసిన అతడు 11.50 ఎకానమీతో 23 పరుగులు సమర్పించుకున్నాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.
ఓ ఛానెల్‌లో జరిగిన చర్చాకార్యక్రమంలో షాహిద్ అఫ్రిది పాల్గొని మాట్లాడాడు. తన అల్లుడు షాహీన్ అఫ్రిది బౌలింగ్‌లో విఫలం కావడం పై విమర్శలు గుప్పించాడు. ‘అదృష్ట వశాత్తు షాహీన్ బ్యాట్‌తో కొన్ని పరుగులు చేశాడు. అవి మా జట్టు స్కోరును 100 పరుగులు దాటించడానికి సాయపడింది. కానీ షాహీన్ పరుగులు చేయడాన్ని నేను ఇష్టపడను. అతడు బౌలింగ్‌లో రాణించాలి.’ అని అఫ్రిది అన్నాడు.
షాహీన్ జట్టులో తన పాత్ర ఏంటో తెలుసుకోవాలన్నాడు. కొత్తబంతితో స్వింగ్ చేస్తూ వికెట్లు తీసి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచడం ఎలాగో నేర్చుకోవాలన్నాడు. తన గేమ్ ఫ్లాన్ మీద అతడు ఎక్కువగా దృష్టి పెట్టాలని చెప్పుకొచ్చాడు. తన బౌలింగ్‌తో పాక్‌ను గెలిపించాలని సూచించాడు.
భారత్‌తో మ్యాచ్‌లో సామ్ అయూబ్ బౌలింగ్‌లో మూడు వికెట్లు పడగొట్టాడు. దీనిపై అఫ్రిది మాట్లాడుతూ.. అయూబ్ బౌలింగ్ వద్దు.. అతడు బ్యాట్‌తో పరుగులు రాబట్టాలి అని అన్నాడు.
Hardik Pandya : జాస్మిన్ వాలియాతో కటీఫ్..! హార్దిక్ పాండ్యా కొత్త గర్ల్‌ఫ్రెండ్ ఎవరో తెలుసా?
పాకిస్తాన్‌లోని క్రికెట్ వ్యవస్థ పై కూడా అఫ్రిది విమర్శలు గుప్పించాడు. దేశంలో ఫస్ట్-క్లాస్ క్రికెట్ నాణ్యత ‘థర్డ్-క్లాస్’ అని చెప్పాడు. నాణ్యమైన కోచ్‌లు, సౌకర్యాలు కల్పిస్తేనే గొప్ప ఆటగాళ్లు తయారు అవుతారన్నడు. ఇప్పటికైనా దేశవాళీపై దృష్టి పెట్టాలని, నిధులు వెచ్చించాలని పీసీబీని అఫ్రిది కోరాడు.