Suryakumar Yadav undergoes sports hernia surgery
Suryakumar Yadav : టీమ్ఇండియా స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ ఆస్పత్రి బెడ్ పై ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో అతడికి ఏమైందోనని చాలా మంది కంగారు పడుతున్నారు. ఈ ఫోటోని స్వయంగా సూర్యకుమార్ యాదవ్ పోస్ట్ చేయడం గమనార్హం. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20 మ్యాచులో సూర్యకుమార్ యాదవ్ గాయపడిన సంగతి తెలిసిందే. కాగా.. స్పోర్ట్స్ హెర్నియాతో బాధపడుతున్న అతడు జర్మనీలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో అతడికి శస్త్రచికిత్స నిర్వహించారు.
తన సర్జరీ విజయవంతంగా పూర్తి అయిందన్న విషయాన్ని తెలియజేస్తూ ఆస్పత్రిలో బెడ్ పై ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ‘సర్జరీ విజయవంతమైంది. నేను తొందరగా కోలుకోవాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను చాలా ఆనందంగా ఉన్నాను. త్వరలోనే మళ్లీ క్రికెట్ ఆడుతా.’ అని సూర్య రాసుకొచ్చాడు. దీని చూసిన నెటిజన్లు.. సూర్య తొందరగా కోలుకుని మైదానంలోకి అడుగుపెట్టాలని ఆకాంక్షిస్తున్నారు.
బెంగళూరు టీ20లో భారీ రికార్డులు.. అంతర్జాతీయ మ్యాచ్‌లో అలా జరగడం తొలిసారి
కాగా.. పలు నివేదికల ప్రకారం సూర్య పూర్తి ఫిట్‌నెస్ సాధించేందుకు కనీసం నెల రోజుల సమయం పడుతుందని తెలుస్తోంది. ఐపీఎల్ 2024 సీజన్ నాటికి అతడు పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాడని అంటున్నాడు. అదే సమయంలో ఆరంభ మ్యాచ్‌లకు దూరం అయ్యే అవకాశాలను కొట్టి పారేయలేమని అంటున్నారు. ఎందుకంటే.. ఐపీఎల్ కంటే టీ20 ప్రపంచకప్ చాలా ముఖ్యం అన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సూర్యకుమార్ కు ఇప్పటికే తగిన సూచనలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పూర్తి ఫిట్‌నెస్ సాధించేంత వరకు మైదానంలో అడుగుపెట్టవద్దని సూచించిదట.
సూర్య ఎంతో కీలకం..
మిగిలిన ఫార్మాట్ల సంగతి ఎలా ఉన్నప్పటికీ టీ20ల్లో సూర్య స్టార్ ప్లేయర్ అన్న సంగతి తెలిసిందే. పొట్టి ఫార్మాట్‌లో అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. టీ20ల్లో నెంబర్ వన్ బ్యాటర్‌గా ఉన్న సూర్య.. ఇప్పటి వరకు టీమ్ఇండియా తరుపున 57 ఇన్నింగ్స్‌లు ఆడి 171.55 స్ట్రైక్ రేటుతో 2141 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు శతకాలు, 17 అర్ధశతకాలు ఉన్నాయి. వెస్టిండీస్, అమెరికాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 ప్రపంచకప్ 2024లో గనుక సూర్య ఆడకుంటే మాత్రం అది భారత్‌కు గట్టి ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు.
Surgery done✅
I want to thank everyone for their concerns and well wishes for my health, and I am happy to tell you all that I will be back very soon ? pic.twitter.com/fB1faLIiYT
— Surya Kumar Yadav (@surya_14kumar) January 17, 2024