Suryakumar Yadavcomments after special South Africa series win
దక్షిణాఫ్రికా గడ్డ పై భారత జట్టు అదరగొట్టింది. సూర్య కుమార్ యాదవ్ నాయకత్వంలో భారత్ నాలుగు మ్యాచుల టీ20 సిరీస్‌ను 3-1 తేడాతో కైవసం చేసుకుంది. జోహెన్స్‌బర్గ్ వేదికగా శుక్రవారం జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత్ 135 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 283 పరుగులు చేసింది. తిలక్ వర్మ (120 నాటౌట్; 47బంతుల్లో 9 ఫోర్లు, 10 సిక్సర్లు), సంజూ శాంసన్ (109 నాటౌట్; 56 బంతుల్లో 6 ఫోర్లు, 9సిక్సర్లు) శతకాలతో కదం తొక్కారు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా తడబడింది. 18.2 ఓవర్లలో 148 పరుగులకే కుప్పకూలింది. సఫారీ బ్యాటర్లలో హెన్రిచ్ క్లాసెన్ (43; 29 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు), డేవిడ్ మిల్లర్ (3;6 27 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లు తీశాడు. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్‌లు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. హార్దిక్ పాండ్య, రమణ్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్‌లు తలా ఓ వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో భారత్ 135 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.
Rohit Sharma: రోహిత్ శర్మ మరోసారి తండ్రయ్యాడు.. మగబిడ్డకు జన్మనిచ్చిన రితికా సజ్దే
మ్యాచ్ అనంతరం టీమ్ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడాడు. తిలక్ వర్మ, సంజూ శాంసన్, అభిషేక్ శర్మ ల ప్రదర్శన పట్ల ఆనందం వ్యక్తం చేశాడు. సిరీస్ విజయం పట్ల స్పందించాడు. పరిస్థితులకు చక్కగా అలవాటు పడడమే తమ విజయ రహస్యం అని ఇందులో ఎలాంటి దాపరికం లేదన్నాడు. తమ ప్రణాళికలు స్పష్టంగా ఉన్నాయన్నాడు. గత దక్షిణాఫ్రికా పర్యటనలో ఇలాంటి బ్రాండ్ క్రికెట్ ఆడామని, ఇప్పుడు దాన్ని కొనసాగిస్తున్నామని చెప్పారు.
ఇక నాలుగో టీ20 గురించి మాట్లాడుతూ.. తిలక్ వర్మ, సంజూ శాంసన్ ల సెంచరీలలో ఒకటిని ఎంచుకోవడం చాలా కష్టం అని చెప్పాడు. వారిద్దరు అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చారన్నాడు. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఫ్లడ్ లైట్స్, ఉష్ణోగ్రత తగ్గిన అనంతరం మాకు అనుకూలిస్తుందని భావించాం. బౌలర్లు చక్కని లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేసి ఫలితాన్ని రాబట్టారని అన్నాడు.
India Vs South Africa: అయ్యో.. సంజూ కొట్టిన సిక్స్‌కు కన్నీరు పెట్టుకున్న యువతి.. వీడియో వైరల్
దక్షిణాఫ్రికాకు వచ్చి గెలిచి వెళ్లడమంటే సవాలేననిచెప్పాడు. ఈ విజయం ఎంతో ప్రత్యేకమైనది అని సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు.