KSCA XI vs Lancashire Match
Swarm Bees In Cricket Ground : తేనెటీగల గుంపును చూస్తే ఎవరైనా ఆమడదూరం పారిపోతారు. అవిదాడి చేశాయంటే నొప్పి భరించలేనంత ఉంటుంది. అంతేకాదు.. ఒక్కోసారి ప్రాణాలకు ముప్పువాటిల్లుతుంది. దీంతో తేనెటీగల సమూహం కనిపిస్తే చాలా రక్షణ చర్యలు తీసుకుంటారు. తాజాగా.. క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో తేనెటీగల గుంపు మైదానంలోకి దూసుకొచ్చింది. భయంతో క్రీడాకారులు, అంపైర్లు మైదానంలో బోర్లా పడుకుండిపోయారు. అవి వెళ్లిపోయిన తరువాత లేచి మళ్లీ ఆటను మొదలు పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Also Read : IPL 2024 : కోహ్లీ నామస్మరణతో దద్దరిల్లిపోయిన చిన్నస్వామి స్టేడియం.. వీడియో వైరల్
లంకాషైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ భారత్ పర్యటనలో ఉంది. లంకాషైర్ జట్టు, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA) XI జట్టు మధ్య ప్రీ- సీజన్ టెస్ట్ మ్యాచ్ మంగళవారం జరిగింది. ఈ మ్యాచ్ లో కేఎస్‌సీఏ తొమ్మిది వికెట్ల నష్టానికి 348 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తుంది. ఇదే సమయంలో తేనెటీగల గుంపు మైదానంలోకి దూసుకొచ్చింది. దీంతో భయాందోళనకు గురైన అంపైర్లు, క్రీడాకారులు వెంటనే మైదానంలోనే బోర్లా పడుకుండిపోయారు. తేనెటీగల గుంపు మైదానంను వీడిన తరువాత క్రీడాకారులు హమ్మయ్య అంటూ ఊపిరిపీల్చుకొని కొద్దిసేపటి తరువాత మళ్లీ మ్యాచ్ మొదలు పెట్టారు. తేనెటీగల గుంపు మైదానంలోకి వచ్చిన వీడియో, అంపైర్లు, క్రీడాకారులు వాటినుంచి రక్షణ పొందేందుకు నేలపై పడుకున్న సమయంలో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Also Read : చెన్నై సూపర్ కింగ్స్‌కు మరో షాక్.. గాయపడ్డ ఫాస్ట్ బౌలర్
https://twitter.com/FanCode/status/1770044805009256748?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1770044805009256748%7Ctwgr%5E5f5a916d89cda00da5acef14320e65562478849b%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.latestly.com%2Fsocially%2Fsports%2Fcricket%2Fswarm-of-bees-force-players-and-umpires-to-lie-flat-on-cricket-ground-during-ksca-xi-vs-lancashire-watch-video-5832670.html