చెన్నై సూపర్ కింగ్స్‌కు మరో షాక్.. గాయపడ్డ ఫాస్ట్ బౌలర్
ఫస్ట్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ తలపడనుంది. మ్యాచ్ ప్రారంభానికి ముందే CSKకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

Mustafizur Rahman Injured: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 సీజన్ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నెల 22న జరిగే ఫస్ట్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ తలపడనుంది. మ్యాచ్ ప్రారంభానికి ముందే చెన్నై సూపర్ కింగ్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ గాయంతో తాజా ఐపీఎల్‌కు దూరమయ్యే పరిస్థితి వచ్చింది.
శ్రీలంకతో జరిగిన మూడో ODIలో 10వ ఓవర్‌లో ముస్తాఫిజుర్ కాలి నొప్పితో బాధపడ్డాడు. నడవడానికి కూడా ఇబ్బంది పడ్డాడు. దీంతో అతడిని స్ట్రైచర్ పై మైదానం నుంచి చికిత్స కోసం తీసుకెళ్లారు. ఐపీఎల్ ప్రారంభమయ్యే నాటికి అతడు కోలుకుంటాడా, లేదా అనేది సస్సెన్స్‌గా మారింది. ముస్తాఫిజుర్‌ను వేలంలో రూ. 2 కోట్లకు CSK దక్కించుకుంది. అతడి ఆరోగ్య పరిస్థితిపై CSK ఆరా తీస్తోంది.
కాగా, CSK ఓపెనర్ డెవాన్ కాన్వే ఇప్పటికే ఐపీఎల్ ఫస్టాఫ్‌కు దూరమయ్యాడు. ఎడమ చేతి బొటన వేలికి గాయంతో అతడికి వైద్యులు సర్జరీ చేశాడు. అతడు కోలుకోవడానికి 8 వారాల సమయం పడుతుందని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ నేపథ్యంలో అతడు ఐపీఎల్ మొదటి అర్థభాగం మ్యాచ్‌ల్లో ఆడకపోవచ్చని భావిస్తున్నారు.
పలువురు ఆటగాళ్లు గాయాల బారినపడడంతో ఐపీఎల్‌కు పూర్తిగా దూరం కావడమో, సగం మ్యాచ్‌లు ఆడలేని పరిస్థితులు నెలకొన్నాయి. స్పోర్ట్స్ హెర్నియాతో బాధ పడుతున్న ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఫస్టాఫ్ లో బరిలోకి దిగకపోవచ్చు. గుజరాత్ టైటాన్స్ రూ.3.6 కోట్లు వెచ్చించి సొంతం చేసుకున్న రాబిన్ మింజ్.. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. అతడు బరిలోకి దిగుతాడా, లేదా అనేది సస్పెన్స్‌గా మారింది.
Also Read: శ్రేయాస్ అయ్యర్ క్రేజ్ చూశారా.. షేక్‌హ్యాండ్ ఇచ్చేందుకు అభిమానులు ఏం చేశారో చూడండి.. వీడియో వైరల్