PV Sindhu : స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్.. ఫైనల్లో పీవీ సింధు, ప్రణయ్

స్విస్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత ఆటగాళ్లు అదరగొడుతున్నారు. షట్లర్లు పీవీ సింధు, హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ ఫైనల్లోకి ప్రవేశించారు. వీరిద్దరూ వరుస సెట్లలో...

PV Sindhu : స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్.. ఫైనల్లో పీవీ సింధు, ప్రణయ్

Swiss Open Badminton 2022

Updated On : March 27, 2022 / 6:47 AM IST

Swiss Open Badminton 2022 : స్విస్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత ఆటగాళ్లు అదరగొడుతున్నారు. షట్లర్లు పీవీ సింధు, హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ ఫైనల్లోకి ప్రవేశించారు. వీరిద్దరూ వరుస సెట్లలో విజయం సాధించి ఫైనల్‌లోకి దూసుకెళ్లారు. స్విస్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌-300 బ్యాడ్మింటన్‌ టోర్నీలో పీవీ సింధు వరుసగా రెండో ఏడాది ఫైనల్లోకి దూసుకెళ్లింది. 2022, మార్చి 26వ తేదీ శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్లో.. సింధు థాయ్‌లాండ్ క్రీడాకారిణిపై విజయం సాధించింది.

Read More : IPL2022 KKR Beats CSK : ఐపీఎల్‌లో కోల్‌కతా బోణీ.. చెన్నైపై గెలుపు

79 నిమిషాల్లో 21-18, 15-21, 21-19తో సుపనిద కటెథోంగ్‌పై గెలిచింది. ఆదివారం జరిగే ఫైనల్లో బుసానన్‌ తో సింధు తలపడనుంది. గతేడాది ఫైనల్లో స్పెయిన్‌కు చెందిన కరోలినా మారిన్‌ చేతిలో ఓడి సింధు రన్నరప్‌గా నిలిచింది. అటు పురుషుల సింగిల్స్‌లో ప్రణయ్‌ కూడా ఫైనల్లోకి ప్రవేశించాడు. తొలి సెమీఫైనల్లో ప్రణయ్‌.. ఇండోనేషియాకు చెందిన ఆటడాడిపై విజయం సాధించాడు.

Read More : CSKVsKKR Target 132 : చెలరేగిన కోల్‌కతా బౌలర్లు, ధోని ధనాధన్ బ్యాటింగ్, కేకేఆర్ టార్గెట్ 132

21-19, 19-21, 21-18తో ఐదో ర్యాంకర్‌ జిన్‌టింగ్‌ ను మట్టికరిపించి ఫైనల్లో అడుగు పెట్టాడు. ఇక రెండో సెమీఫైనల్లో కిడాంబి శ్రీకాంత్‌ 21-18, 7-21, 13-21తో ఇండోనేషియాకు చెందిన జొనాథన్‌ క్రిస్టీ చేతిలో ఓడిపోయాడు.