T20 HUNDRED No10 for DAVID WARNER and his second of this BBL season
David Warner : ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు డేవిడ్ వార్నర్ బిగ్‌బాష్ లీగ్ 2025-26 సీజన్‌లో అదరగొడుతున్నాడు. ఈ సీజన్‌లో రెండో సెంచరీని నమోదు చేశాడు. సిడ్నీ థండర్ కు నాయకత్వం వహిస్తున్న వార్నర్ (David Warner) శుక్రవారం సిడ్నీ సిక్సర్స్ తో మ్యాచ్‌లో 61 బంతుల్లో శతకాన్ని అందుకున్నాడు. ఈ నేపథ్యంలో బిగ్‌బాష్ లీగ్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో బెన్ మెక్‌డెర్మాట్, స్టీవ్ స్మిత్‌లతో కలిసి వార్నర్ సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. వీరంతా బిగ్‌బాష్ లీగ్‌లో తలా మూడు శతకాలు సాధించారు.
బిగ్‌బాష్ లీగ్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లు వీరే..
* బెన్ మెక్‌డెర్మాట్ – 3 సెంచరీలు
* స్టీవ్ స్మిత్ – 3 సెంచరీలు
* డేవిడ్ వార్నర్ – 3 సెంచరీలు
ఇక ఓవరాల్‌గా టీ20 క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో వార్నర్ మూడో స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ, రిలీ రూసోలను అధిగమించాడు. టీ20 క్రికెట్‌లో వార్నర్‌కు ఇది 10వ సెంచరీ కావడం విశేషం. ఇక ఈ జాబితాలో క్రిస్‌గేల్ 22 శతకాలతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తరువాత బాబర్ ఆజామ్ 11 సెంచరీలు సాధించాడు.
టీ20 క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్లు వీరే..
* క్రిస్ గేల్ – 22 సెంచరీలు
* బాబర్ ఆజామ్ -11 సెంచరీలు
* డేవిడ్ వార్నర్ – 10 సెంచరీలు
* విరాట్ కోహ్లీ – 9 సెంచరీలు
* రీలీ రూసో – 9 సెంచరీలు
RCB : పార్టీలో ఆర్‌సీబీ ప్లేయర్ల జోష్ చూశారా?
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. డేవిడ్ వార్నర్ (110 నాటౌట్; 65 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లు) శతకంతో చెలరేగడంతో సిడ్నీ థండర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. సిడ్నీ బ్యాటర్లలో వార్నర్ కాకుండా నిక్ మాడిన్సన్ (26) మాత్రమే రాణించాడు. సిడ్నీ సిక్సర్స్ బౌలర్లలో సామ్ కరన్ మూడు వికెట్లు తీశాడు. మిచెల్ స్టార్క్, జాక్ ఎడ్వర్డ్స్, బెన్ మనెంటి లు తలా ఓ వికెట్ తీశారు.