T20 World Cup 2021 : ఆస్ట్రేలియా టార్గెట్ 158

టీ20 వరల్డ్ కప్ లో సూపర్-12 దశలో భాగంగా నేడు గ్రూప్-1లో ఆసక్తికర మ్యాచ్ జరుగుతోంది. అబుదాబిలో వేదికగా ఆస్ట్రేలియా, వెస్టిండీస్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా..

T20 World Cup 2021 : టీ20 వరల్డ్ కప్ లో సూపర్-12 దశలో భాగంగా నేడు గ్రూప్-1లో ఆసక్తికర మ్యాచ్ జరుగుతోంది. అబుదాబిలో వేదికగా ఆస్ట్రేలియా, వెస్టిండీస్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా ముందు 158 పరుగుల లక్ష్యం ఉంచింది.

Ladyfinger : రక్త సరఫరా మెరుగు పరిచి…శ్వాసకోశ సమస్యల్ని దూరం చేసే బెండకాయ

విండీస్ బ్యాటర్లలో కీరన్ పొలార్డ్ (31 బంతుల్లో 44 పరుగులు) రాణించాడు. ఓపెనర్ ఎవిన్ లెవిస్ (29), హెట్ మెయిర్ (27), రస్సెల్ (18) పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో హేజిల్ వుడ్ నాలుగు వికెట్లు తీశాడు. కమిన్స్, జంపా, మిచెల్ స్టార్క్క్ తలో వికెట్ తీశారు.

Obesity medicine : ఊబకాయం తగ్గించే ఇంజెక్షన్..ఎగబడుతున్న జనాలు..

ఆసీస్ కు ఇది తప్పక గెలవాల్సిన మ్యాచ్. గ్రూప్-1లో ఆ జట్టు 4 మ్యాచ్ లు ఆడి 3 విజయాలతో ఉంది. వెస్టిండీస్ పై గెలిస్తే ఆసీస్ కు సెమీస్ అవకాశాలు మెరుగవుతాయి.

మరో మ్యాచ్ లో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా పోటీపడుతున్నాయి. ఇంగ్లండ్ 4 మ్యాచుల్లో 4 విజయాలతో సెమీస్ బెర్తు దాదాపు ఖరారు చేసుకోగా, దక్షిణాఫ్రికా కూడా మరో సెమీస్ బెర్తుపై కన్నేసింది. ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా గెలిస్తే… ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లలో మెరుగైన రన్ రేట్ ఉన్న జట్టు సెమీస్ కు వెళుతుంది.

వెస్టిండీస్ పై ఆస్ట్రేలియా ఓడిపోతే దక్షిణాఫ్రికా రన్ రేట్ తో పని లేకుండా నేరుగా సెమీస్ చేరుతుంది. ఒకవేళ ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు నేటి మ్యాచ్ లలో ఓడిపోయినా నెట్ రన్ రేటే కీలకమవుతుంది.

ట్రెండింగ్ వార్తలు