Obesity medicine : ఊబకాయం తగ్గించే ఇంజెక్షన్..ఎగబడుతున్న జనాలు..

ఊబకాయం తగ్గించే మెడిసిన్ కు మొదటిసారి అనుమతులు వచ్చాయి. దీంతో అమెరికా వాసులు ఈ మెడిసిన్ కోసం ఎగబడుతున్నారు.

Obesity medicine : ఊబకాయం తగ్గించే ఇంజెక్షన్..ఎగబడుతున్న జనాలు..

Full Demand For Obesity Medicine (1)

Full demand for obesity medicine :  ఊబకాయం. ఎన్నో అనారోగ్య సమస్యలకు దారి తీస్తోంది. ఊబకాయం సమస్యతో ఎంతోమంది బాధపడుతున్నారు. మారుతున్న జీవనశైలి దీనికి ప్రధానకారణమని చెప్పాలి. ఫాస్టు ఫుడ్, పెరుగుతున్న ఒత్తిడి వెరసి ఊబకాయానికి దారి తీస్తోంది. ఊబకాయాన్ని తగ్గించుకోవాలని ఉన్నా..అది కాస్త కష్టమనే చెప్పాలి. ఎందుకంటే ఆహారపు అలవాట్లలో చాలా మార్పులు చేసుకోవాలి. వ్యాయామం చేయాలి. ప్రస్తుత బిజీ బిజీ జీవితాల్లో అది సాధ్యం కావట్లేదు చాలా మందికి. దీంతో ఈజీగా ఊబకాయం తగ్గించుకోవటానికి ఏవే దారులున్నాయో వాటిని పాటించేస్తున్నారు. కాస్త డబ్బు ఉన్నవారు సర్జరీలు చేయించుకుంటున్నారు. కానీ ఈ సర్జరీల వల్ల సైడ్ ఎఫెక్టులే కాదు పలు అనారోగ్య సమస్యలు వచ్చిపడుతున్నాయి.

Read more : Weight Loss Tips: మీరు బరువు తగ్గాలనుకుంటే, ఇది ఓ మంచి మార్గం.. ఈ 5 డ్రై ఫ్రూట్‌లతో ట్రై చెయ్యండి

దీంతో ఊబకాయం తగ్గటానికి ఏమన్నా మెడిసిన్స్ వస్తే బాగుండు. ఇలా గుటుక్కున మింగేసి అలా బరువు తగ్గిపోదాం..లేదా ఇంజెక్షన్ అయితే ఇలా చురుక్కున పొడిపించేసుకుంటే అలా బరువు తగ్గిపోవచ్చు.. అని అనుకుంటారు. కానీ అది సాధ్యమేనా? సాధ్యమో అసాధ్యమో గానీ ఇటువంటి మెడిసిన్స్ కూడా బాగా డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా అమెరికా వాసులు ఊబకాయం తగ్గించుకోవటానికి మెడిసిన్స్ వైపే మొగ్గుచూపిస్తున్నారు. దీంతో బరువు తగ్గించే మెడిసిన్స్ కు అమెరికాలో బాగా డిమాండ్ పెరిగింది.అమెరికాలో ఊబకాయంతో బాధపడుతున్న వారు ఇప్పుడు మెడికల్‌ షాపులకు పోటెత్తుతున్నారు. నోవో నోర్డిస్క్‌ అనే ఔషధ సంస్థ తయారు చేసిన ‘వీగోవీ’ అనే ఔషధానికి ఇప్పుడు అక్కడ భారీ గిరాకీ ఉంది. దీంతో డిమాండ్ కు తగిన మెడిసిన్స్ అందించలేకపోతున్న పరిస్థితి ఉంది అమెరికాలో.

బరువు తగ్గించే మెడిసిన్స్ కు అమెరికాలో జూన్‌లో అనుమతులు లభించాయి. బరువు తగ్గించే ఓ మెడిసిన్స్ కు అనుమతి రావటం ఇదే తొలిసారి. గతంలో వచ్చినా..వాటికి నియంత్రణ సంస్థల క్లియరెన్స్‌ రాలేదు. పైగా తీవ్ర సైండ్ ఎఫెక్ట్ బాగా ఉండేవి. వాటికి పెద్దగా రిజల్ట్స్ కూడా రాలేదు.ఈ క్రమంలో ‘వీగోవీ’కి డిమాండ్ పెరిగింది.వీగోవీ మెడిసిన్ ఓ ఇంజెక్షన్‌. వారానికి ఒక డోసు తీసుకోవాలి. ఈ ఇంజెక్షన్ చేయించుకుంటే ఆకలిని తగ్గుతుంది. దీంతో ఎక్కువ ఆహారం తినలేదు.తద్వారా బరువు తగ్గుతుంది. ఈ ఇంజెక్షన్ తో 15 శాతం వరకు బరువు తగ్గే అవకాశం ఉందని సమాచారం. దీంతో ఈ ఇంజెక్షన్ ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో ఇంకేముంది..డెన్మార్క్‌కు చెందిన నోవో నోర్డిస్క్‌ కంపెనీకి ఆదాయం భారీగా వచ్చిపడుతోంది. ఈ సంస్థ ఆదాయం ఏకంగా 41 శాతం పెరిగింది అంటే ఈ మెడిసిన్ కు డిమాండ్ ఎలా ఉందో ఊహించుకోవచ్చు.

Read more : Rice : అన్నం అతిగా తింటే ఊబకాయం వస్తుందా?..

ఈ మెడిసిన్ కు డిమాండ్ పెరగడానికి కరోనా కూడా ఓ కారణం అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఊబకాయంతో బాధపడుతున్న వారికి కరోనా సోకే ప్రమాదం ఎక్కువగా ఉందని అధ్యయనాలు తేల్చడంతో బరువు తగ్గాలనే తపన పెరిగిందని సంస్థ సీఈఓ లార్స్‌ జోర్గెన్సన్‌ తెలిపారు. ఈ డిమాండ్ పెరుగుతున్న క్రమంలో 2022 ఆరంభం నాటికి డిమాండ్‌కు సరిపడా స్థాయిలో మెడిసిన్ ఉత్పత్తి చేస్తామన్నారు.

డయాబెటిస్‌ చికిత్సలకు సంబంధించిన మెడిసిన్ తయారు చేయడంలో నోవో నోర్డిస్క్‌కు మంచి పేరుంది. 2025 నాటికి ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మంది ఊబకాయంతో బాధపడే అవకాశం ఉందన్న అంచనాలతో ఈ సంస్థ ఆ పరిస్థితిని క్యాష్ చేసుకోవాలనుకుంది. అమెరికాలో మూడోవంతు యువకులు స్థూలకాయంతో బాధపడుతున్నారు. 2018 తర్వాత ఈ సంఖ్యం రెండు శాతం పెరిగింది.

Read more : Keto Diet : కీటో డైట్ తో బరువు తగ్గొచ్చా?..

2022 నాటికి అమెరికాలో వీగోవీకి భారీ డిమాండ్ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో సంస్థ వార్షికాదాయం 2024 నాటికి 3.2 బిలియన్ డాలర్లకు ఎగబాకే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కాగా ఊబకాయం తగ్గించుకోవాలనే యావలో సైడ్ ఎఫెక్టుల్ని పట్టించుకోవట్లేదు జనాలు. ఈ మెడిసిన్ వినియోగం వల్ల వాంతులు, యాసిడ్‌ రీఫ్లక్స్ వంటి దుష్ప్రభావాలు కూడా ఉన్నట్లు సమాచారం. కానీ జనాలకు అవేమీ పట్టటంలేదు. ఓ క్రమ పద్ధతిలో బరువు తగ్గాలని ఆలోచన మానేసి.అర్జంట్ గా బరువు తగ్గిపోవాలని ఇటువంటి మెడిసిన్స్ పై ఆధారపడుతున్నారు.న