T20 World Cup 2021 : పాకిస్తాన్‌తో సెమీస్‌లో ఆస్ట్రేలియా టార్గెట్ 177

టీ20 వరల్డ్ కప్ రెండో సెమీఫైనల్లో భాగంగా పాకిస్తాన్, ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. టాస్ నెగ్గిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత ఓవర్లలో..

T20 World Cup 2021 : టీ20 వరల్డ్ కప్ రెండో సెమీఫైనల్లో భాగంగా పాకిస్తాన్, ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. టాస్ నెగ్గిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. పాక్ ఓపెనర్లు మహమ్మద్ రిజ్వాన్, బాబర్ అజామ్ శుభారంభం ఇచ్చారు.

Wi-Fi HaLow : సరికొత్త వై-ఫై టెక్నాలజీ వస్తోంది.. కిలోమీటర్ దూరంలోనూ Wi-Fi కనెక్ట్ కావొచ్చు!

రిజ్వాన్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. 52 బంతుల్లో 67 పరుగులు చేశాడు. కెప్టెన్ బాబర్ 34 బంతుల్లో 39 పరుగులు చేశాడు. ఫకార్ జమాన్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. 32 బంతుల్లో 55 పరుగులు చేశాడు. నాలుగు సిక్సులు బాదాడు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 2 వికెట్లు తీశాడు. ఆడమ్ జంపా, పాట్ కమిన్స్ తలో వికెట్ తీశారు.

టీ20 వరల్డ్ కప్ లో నేడు రెండో సెమీఫైనల్ జరుగుతోంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా పాకిస్తాన్, ఆస్ట్రేలియా తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో నెగ్గిన టీమ్ ఫైనల్లో న్యూజిలాండ్ తో తలపడుతుంది.

ట్రెండింగ్ వార్తలు