Wi-Fi HaLow : సరికొత్త వై-ఫై టెక్నాలజీ వస్తోంది.. కిలోమీటర్ దూరంలోనూ Wi-Fi కనెక్ట్ కావొచ్చు!

తక్కువ విద్యుత్ వినియోగంతో కనెన్ట్ అయ్యేందుకు ఓ సరికొత్త వైఫై టెక్నాలజీ వస్తోంది. ఈ టెక్నాలజీ ద్వారా 1 కిలోమీటరు దూరం వరకు వైఫై సిగ్నల్ పొందవచ్చు.

Wi-Fi HaLow : సరికొత్త వై-ఫై టెక్నాలజీ వస్తోంది.. కిలోమీటర్ దూరంలోనూ Wi-Fi కనెక్ట్ కావొచ్చు!

New Wi Fi Technology Promises Up To 1 Km Range, Significant Power Savings

New Wi-Fi technology Wi-Fi HaLow : డిజిటల్ యుగం.. అంతా ఆన్‌లైన్‌లోనే.. ఏదైనా క్షణాల్లో డేటా షేర్ అయిపోతుంది. ఇదంతా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (loT) టెక్నాలజీ మాయనే.. సాధారణ వైర్‌లెస్ టెక్నాలజీకి కొంతదూరం మాత్రమే లిమిట్ ఉంటుంది. అక్కడివరకు మాత్రమే యాక్సస్ అవుతుంది. ఆ తర్వాత కష్టమే.. అందుకే వైర్ ద్వారా ఇంటర్నెట్ కనెక్ట్ చేస్తుంటారు. ఇందుకు విద్యుత్ వినియోగం కూడా అవసరం పడుతుంది. ఇకపై తక్కువ విద్యుత్ వినియోగంతో కనెన్ట్ అయ్యేందుకు ఓ సరికొత్త వైఫై టెక్నాలజీ వస్తోంది. ఈ టెక్నాలజీ ద్వారా తక్కువ విద్యుత్ వినియోగంతో 1 కిలోమీటరు దూరం వరకు వైఫై సిగ్నల్ పొందవచ్చు. అదే.. Wi-Fi HaLow టెక్నాలజీ.. ఈ కొత్త టెక్నాలజీ అతిత్వరలో అందుబాటులోకి రానుంది. ప్రపంచవ్యాప్త కంపెనీల నెట్‌వర్క్ Wi-Fi Alliance ఈ విషయాన్ని వెల్లడించింది.

ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) డివైజ్ వినియోగంలో భారీ పెరుగుదల దృష్ట్యా Wi-Fi HaLow టెక్నాలజీ వస్తోంది. పరిశ్రమలు, గృహాలలో IoT అప్లికేషన్‌ల వినియోగం పెరిగిపోతున్న క్రమంలో ఎక్కువ డివైజ్‌లు ఇంటర్నెట్‌కి నిరంతరం కనెక్ట్ అయి ఉండాల్సిన అవసరం ఉంది.  Wi-Fi HaLow టెక్నాలజీ రాకతో ఆ సమస్యకు చెక్ పడనుంది. ఈ కొత్త Wi-Fi టెక్నాలజీ.. ప్రస్తుత Wi-Fiతో పోలిస్తే గణనీయమైన బ్యాటరీ శక్తిని ఆదా చేస్తుంది. 1 కిలోమీటరు దూరం వరకు కనెక్షన్‌లను అందించవచ్చు. Wi-Fi HaLow ఇప్పటికే ఉన్న Wi-Fi ప్రోటోకాల్‌పై రూపొందించడం జరిగింది. ప్రస్తుత Wi-Fi డివైజ్ లకు అనుగుణంగా వేగంగా పనిచేయగలదు. మీ Wi-Fi యాక్సస్ పాయింట్ నుంచి ఒక కిలోమీటరు దూరంలో అన్ని కనెక్షన్‌లకు కనెక్ట్ చేసుకోవచ్చు.

Wi-Fi HaLow ఎలా పని చేస్తుందంటే?
ఎలక్ట్రానిక్ డివైజ్‌లను ఇంటర్నెట్‌తో కనెక్ట్ చేయాలంటే.. ఎక్కువగా 2.4GHz నుంచి 5GHz రేడియో ఫ్రీక్వెన్సీ Wi-Fi వినియోగిస్తుంటారు. ఈ డివైజ్‌లు తక్కువ సమయంలో అధిక మొత్తంలో డేటాను షేర్ చేస్తాయి. అదే.. Wi-Fi HaLow టెక్నాలజీ విషయానికి వస్తే.. భారీ రేడియో ఫ్రీక్వెన్సీ బదులుగా సబ్-1 గిగా Hz స్పెక్ట్రమ్‌తో వర్క్ అవుతుంది. అంటే.. తక్కువ-ఫ్రీక్వెన్సీ వేవ్ ఎక్కువ తరంగదైర్ఘ్యాన్ని అనుమతిస్తుంది. సిగ్నల్‌లు సాధారణంగా స్పెక్ట్రమ్‌లతో పోలిస్తే ఎక్కువ దూరం ప్రయాణించగలవు. Wi-Fi HaLow యాక్సెస్ పాయింట్ నుంచి 1 కిలోమీటరు వ్యాసార్ధం వరకు కనెక్షన్ ఇచ్చుకోవచ్చు.

ఇందులో ఒకే ఒక డ్రాబ్యాక్ ఉంది.. డేటా స్పీడ్ తగ్గిపోతుంది. కానీ, loT డివైజ్ అప్లికేషన్లకు సరిగ్గా సరిపోతుంది. చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే ఎక్కువగా స్పీడ్ ఇంటర్నెట్ అవసరం పడుతుంది. స్మార్ట్ డోర్ లాక్‌లు, కెమెరాలు, ఎయిర్ కండిషనర్లను ఎక్కడ ఉన్న ఆపరేట్ చేయాలంటే IoT అప్లికేషన్‌ తప్పనిసరిగా ఉండాలి. ఈ డివైజ్‌లకు తక్కువ ఇంటర్నెట్ మాత్రమే అవసరం పడుతుంది. Wi-Fi HaLow కిలోమీటరు దూరంలో ఉన్నా 80MBps వరకు స్పీడ్ వస్తుంది. వందల ఎకరాల్లో విస్తరించి ఉన్న 8వేల కంటే ఎక్కువ డివైజ్‌లకు కూడా ఇంటర్నెట్ యాక్సెస్‌ చేసుకోవచ్చునని Wi-Fi Alliance పేర్కొంది.
Read Also : WhatsApp Status Trick : వాట్సాప్ స్టేటస్ డౌన్‌లోడ్ చేయడం ఇంత ఈజీనా..!