T20 World Cup 2021 : బట్లర్ విధ్వంసం.. ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ ఘన విజయం
టీ20 వరల్డ్ కప్ సూపర్ 12లో భాగంగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

T20 World Cup 2021 England
T20 World Cup 2021 : టీ20 వరల్డ్ కప్ సూపర్ 12లో భాగంగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని ఇంగ్లాండ్ 11.4 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి చేధించింది. ఇంగ్లాండ్ ఓపెనర్ జాస్ బట్లర్ హాఫ్ సెంచరీతో(32 బంతుల్లో 71 పరుగులు) చెలరేగాడు. సిక్సులు(5), ఫోర్ల(5) వర్షం కురిపించాడు. మరో ఓపెనర్ జేసన్ రాయ్ 22, మలన్ 8, బెయిర్ స్టో 16 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో అగర్, ఆడమ్ జంపా తలో వికెట్ తీశారు.
Disease Attack : యువతపై జబ్బుల దాడి… చిన్న వయస్సులోనే మరణం అంచులకు..
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. ఇంగ్లాండ్ బౌలర్లు విజృంభించారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీంతో ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 125 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇంగ్లాండ్ ముందు 126 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్(49 బంతుల్లో 44 పరుగులు) ఒక్కడే రాణించాడు.
అగర్(20), వేడ్(18), కమిన్స్(12), మిచెల్ స్టార్క్(13) పర్లేదనిపించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ మూడు వికెట్లు తీశాడు. వోక్స్ రెండు వికెట్లు తీశాడు. మిల్స్ రెండు వికెట్లు తీశాడు. రషీద్, లివింగ్ స్టన్ తలో వికెట్ తీశారు. 20 ఓవర్లలో 125 పరుగులకు ఆసీస్ ఆలౌట్ అయ్యింది.
Covid-19 Origins : కొవిడ్ పుట్టుక.. వైరస్ మూలాలను ఎప్పటికీ గుర్తించలేం.. జీవాయుధం కానేకాదు!
ఇంగ్లండ్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో భారీ స్కోరు సాధించాలన్న ఆసీస్ ఆశలు నెరవేరలేదు. ఆసీస్ లైనప్ లో చివరి వరుస బ్యాట్స్ మెన్ సిక్సర్లు కొట్టడంతో ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. అగర్ రెండు సిక్సులు, కమిన్స్ రెండు సిక్సులు, స్టార్క్ ఒక ఫోర్, ఒక సిక్స్ కొట్టారు. వార్నర్ (1) విఫలం కాగా, స్టీవెన్ స్మిత్ (1), మ్యాక్స్ వెల్ (6), స్టొయినిస్ (0) నిరాశపరిచారు. ఆసీస్ ఆఖరి నాలుగు ఓవర్లలో 50 పరుగులు రాబట్టింది. దీంతో ఇంగ్లాండ్ ముందు మోస్తరు లక్ష్యాన్ని ఉంచగలిగింది.