T20 World Cup 2021 : ఆసీస్ వర్సెస్ కివీస్.. టీ20 వరల్డ్ కప్ విజేత ఎవరు?

నెలరోజుల పాటు వినోదం అందించిన టీ20 వరల్డ్ కప్ చివరి అంకానికి చేరుకుంది. ఫైనల్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తలపడుతున్నాయి.

T20 World Cup 2021 : నెలరోజుల పాటు వినోదం అందించిన టీ20 వరల్డ్ కప్ చివరి అంకానికి చేరుకుంది. నేడు ఫైనల్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తలపడుతున్నాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో కీలకమైన టాస్ ఆస్ట్రేలియాను వరించింది. టాస్ నెగ్గిన ఆసీస్ సారథి ఆరోన్ ఫించ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. సెమీస్ లోనూ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న ఆసీస్ అద్భుతమైన రీతిలో ఛేజింగ్ చేయడం తెలిసిందే.

కాగా, ఫైనల్ మ్యాచ్ కు ఆసీస్ జట్టులో ఎలాంటి మార్పులు లేవు. పాక్ తో సెమీస్ ఆడిన జట్టునే బరిలో దిగింది. ఇక న్యూజిలాండ్ జట్టులో వికెట్ కీపర్ డెవాన్ కాన్వే స్థానంలో సీఫెర్ట్ జట్టులోకి వచ్చాడు. కాన్వే మొన్నటి మ్యాచ్ లో అసహనంతో తన బ్యాట్ తో తానే కొట్టుకుని గాయపడ్డాడు. అతడు ఈ మ్యాచ్ కు అన్ ఫిట్ అని తేలడంతో సీఫెర్ట్ వికెట్ కీపింగ్ చేయనున్నాడు.

WhatsApp Feature: వాట్సప్‌లో కొందరికి మాత్రమే కనిపించకుండా లాస్ట్ సీన్ హైడ్ ఆప్షన్

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు ఇప్పటివరకు టీ20 వరల్డ్ కప్ గెలవలేదు. దాంతో తొలిసారి టీ20 వరల్డ్ టైటిల్ ను ముద్దాడాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి.

5 సార్లు వన్డే ప్రపంచకప్‌ సొంతం చేసుకున్నప్పటికీ అందని ద్రాక్షలా ఊరిస్తున్న తొలి టీ20 ప్రపంచకప్‌ కోసం ఆస్ట్రేలియా నిరీక్షిస్తోంది. వరుసగా గత రెండు వన్డే ప్రపంచకప్‌ల ఫైనల్లోనూ ఓడి ఈ ఏడాది ప్రపంచ టెస్టు ఛాంపియన్‌గా నిలిచి ఇప్పుడు పొట్టి కప్పు బోణీ కొట్టేందుకు న్యూజిలాండ్ సిద్దమైంది. ఈ రెండు మేటి జట్లు పొట్టి ఫార్మాట్ లో విశ్వవిజేతగా నిలవాలన్న లక్ష్యంతో తుది పోరుకు సిద్ధమయ్యాయి. ఆఖరి యుద్ధంలో అమీతుమీ తేల్చుకునేందుకు సన్నద్ధమయ్యాయి. హోరాహోరీగా జరిగే ఈ సమరంలో గెలిచి.. పొట్టి కప్పును తొలిసారి ముద్దాడేందుకు తహతహలాడుతున్నాయి.

కివీస్‌ కు.. ఇదే తొలి టీ20 వరల్డ్ కప్ ఫైనల్. ఆసీస్‌కి రెండో ఫైనల్‌. 2015 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో ఆసీస్‌ చేతిలో ఓడిన కివీస్‌.. ఇప్పుడా జట్టుపై ప్రతీకారం తీర్చుకుని ఈ ఏడాది రెండో ఐసీసీ ట్రోఫీ అందుకోవాలని చూస్తోంది. ఇప్పటికే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌గా నిలిచిన విలియమ్సన్‌ సేన.. అదే ఊపులో పొట్టి కప్పునూ పట్టేయాలనుకుంటోంది. 2010 ఫైనల్లో ఇంగ్లాండ్‌ చేతిలో ఓడిన ఆసీస్‌.. ఈసారి మాత్రం ట్రోఫీని వదలకూడదనే పట్టుదలతో ఉంది.

Copper : రాగిపాత్రలో నీళ్ళు తాగితే రోగాలు మాయం?

టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో ఇప్పటివరకూ ఈ రెండు జట్లు ఒక్కసారి మాత్రమే (2016లో) తలపడ్డాయి. అప్పుడు కివీస్‌ గెలిచింది. అంతర్జాతీయ టీ20ల్లో ఈ రెండు జట్లు 14 మ్యాచుల్లో పోటీపడగా.. ఆసీస్‌ 9, కివీస్‌ 5 విజయాలు సాధించాయి.

ట్రెండింగ్ వార్తలు