T20 World Cup 2021 : 31 రన్స్ కే ఇండియా 3వికెట్లు డౌన్

 పాకిస్తాన్ తో జరుగుతున్న సూపర్ 12 గ్రూప్ లీగ్ మ్యాచ్ లో టీమిండియా బ్యాటింగ్ లో ఇబ్బంది పడుతోంది.

T20 World Cup 2021 : 31 రన్స్ కే ఇండియా 3వికెట్లు డౌన్

India Vs Pakistan

Updated On : October 24, 2021 / 8:09 PM IST

T20 World Cup 2021 :  పాకిస్తాన్ తో జరుగుతున్న సూపర్ 12 గ్రూప్ లీగ్ మ్యాచ్ లో టీమిండియా బ్యాటింగ్ లో ఇబ్బంది పడుతోంది.  5.4 ఓవర్లలో 31 రన్స్ కే 3 వికెట్లు కోల్పోయింది కోహ్లీ గ్యాంగ్. 8 బాల్స్ లో 11 రన్స్ చేసిన సూర్యకుమార్ యాదవ్ 3వ వికెట్ గా ఔటయ్యాడు. హసన్ అలీ బౌలింగ్ లో .. రిజ్వాన్ కు క్యాచ్ ఇచ్చాడు సూర్యకుమార్ యాదవ్. ఇప్పటికే… ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ లు పెవీలియన్ చేరారు. కోహ్లీకి వికెట్ కీపర్ రిషభ్ పంత్ జతకలిశాడు.

ఆరంభంలోనే భారత ఓపెనర్లను ఔట్ చేసిన పాక్ బౌలర్ షాహిన్ ఆఫ్రిదికి విరాట్ కోహ్లీ గట్టిగా బదులిచ్చాడు. ఆఫ్రిది వేసిన 3వ ఓవర్ ఐదో బాల్ ను స్ట్రెయిట్ గా సిక్సర్ గా బాదాడు. దీంతో… టీమిండియా అభిమానులు, ప్రేక్షకుల్లో కొండంత కాన్ఫిడెన్స్ వచ్చింది.