T20 World Cup 2021 : మరోసారి బౌలర్ల విజృంభణ.. వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ రెండో విజయం

టీ20 వరల్డ్ కప్ లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన పాకిస్తాన్ అదరగొడుతోంది. తొలి మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి భారత్ పై ఘన విజయం సాధించిన పాకిస్తాన్.. సెకండ్ మ్యాచ్ లోనూ విక్టరీ

T20 World Cup 2021 : టీ20 వరల్డ్ కప్ లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన పాకిస్తాన్ అదరగొడుతోంది. తొలి మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి భారత్ పై చారిత్రాత్మక విజయం సాధించి మాంచి ఊపుమీదున్న పాకిస్తాన్.. సెకండ్ మ్యాచ్ లోనూ విక్టరీ కొట్టింది. న్యూజిలాండ్ తో జరిగిన పోరులో పాకిస్తాన్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.

న్యూజిలాండ్ నిర్దేశించిన లక్ష్యాన్ని పాకిస్తాన్ మరో 8 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్లు కోల్పోయి చేధించింది. పాకిస్తాన్ ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్ మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 34 బంతుల్లో 33 పరుగులు చేసి జట్టు విజయంలో కీ రోల్ ప్లే చేశాడు. షోయబ్ మాలిక్ (26), ఆసిఫ్ అలీ(27) జట్టుని విజయతీరాలకు చేర్చారు. కివీస్ బౌలర్లలో సోథి రెండు వికెట్లు తీశాడు. శాంటర్న్, టిమ్ సౌతీ, ట్రెంట్ బౌల్ట్ తలో వికెట్ తీశారు.

Sextortion gang: వెబ్‌సైట్‌లో నగ్నంగా వీడియో కాల్స్‌..! 200మంది నుంచి రూ.22కోట్లు దోచేసిన జంట

షార్జా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లోనూ పాకిస్తాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. పాక్ కెప్టెన్ బాబర్ అజమ్ అంచనాలను బౌలర్లు వమ్ము చేయలేదు. భారత్ పై విజయంలో కీలక పాత్ర పోషించిన పాక్ బౌలర్లు.. కివీస్ తో పోరులోనూ నిప్పులు చెరిగారు. క్వాలిటీ బౌలింగ్ తో కివీస్ బ్యాటర్లను కట్టడి చేశారు. పాక్ బౌలర్ల ధాటికి ఏ దశలోనూ కివీస్ బ్యాటింగ్ సజావుగా సాగలేదు. 20 ఓవర్లలో 8 వికెట్లకు 134 పరుగులే చేసింది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన కివీస్‌ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. మిచెల్‌ ( 20 బంతుల్లో 27 పరుగులు), కాన్వే (24 బంతుల్లో 27 పరుగులు), కేన్ విలియమ్సన్‌ (26 బంతుల్లో 25 పరుగులు) రాణించడంతో పాక్‌ ముందు మోస్తరు లక్ష్యాన్ని ఉంచగలిగింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కి ఓపెనర్లు మార్టిన్‌ గప్తిల్‌ (17 ), మిచెల్‌ శుభారంభం అందించారు. దీంతో కివీస్‌ ఐదు ఓవర్లకు 36/0తో నిలిచింది.

PM Kisan : రూ.6వేలు కాదు రూ.12వేలు.. రైతులకు కేంద్రం శుభవార్త..?

రౌఫ్ వేసిన 6వ ఓవర్‌లో గప్తిల్ ఔటయ్యాడు. ఇమాద్‌ వసీమ్ వేసిన తొమ్మిదో ఓవర్‌లో మిచెల్‌, తర్వాతి ఓవర్‌లో నీషమ్‌ (1) పెవిలియన్‌కి చేరారు. తర్వాత వచ్చిన కాన్వే (24) ధాటిగా ఆడాడు. హాఫీజ్‌ వేసిన 12 ఓవర్లో విలియమ్సన్‌ వరుసగా ఓ ఫోర్‌, సిక్సర్‌ బాదాడు. షాదాబ్‌ ఖాన్ వేసిన తర్వాతి ఓవర్లో కాన్వే వరుసగా మూడు ఫోర్లు కొట్టాడు. రౌఫ్ వేసిన18 ఓవర్‌లో కాన్వే, ఫిలిప్స్ (13) పెవిలియన్ చేరారు. తర్వాతి ఓవర్‌లో సీఫర్ట్‌ (8) కూడా ఔటయ్యాడు. చివరి ఓవర్లో ఆఖరి బంతికి శాంటర్న్‌ (6) బౌల్డ్‌ అయ్యాడు. పాక్‌ బౌలర్లలో ఎక్స్ ప్రెస్ పేసర్ రౌఫ్ 4 వికెట్లు తీసి కివీస్ వెన్ను విరిచాడు. హాఫీజ్‌, ఇమాద్ వసీమ్, షాహీన్ అఫ్రిదీ తలో వికెట్‌ తీశారు.

T20 World Cup 2021, Pakistan Vs New Zealand, kane williamson, mohammad rizwan, babar azam

ట్రెండింగ్ వార్తలు