PM Kisan : రూ.6వేలు కాదు రూ.12వేలు.. రైతులకు కేంద్రం శుభవార్త..?

రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్రం తీసుకొచ్చిన పథకం ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన. దీని కింద ప్రతి ఏటా రూ.6 వేలను మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది

PM Kisan : రూ.6వేలు కాదు రూ.12వేలు.. రైతులకు కేంద్రం శుభవార్త..?

Pm Kisan Samman Nidhi Yojana

PM Kisan : రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్రం తీసుకొచ్చిన పథకం ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన. దీని కింద ప్రతి ఏటా రూ.6 వేలను మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది కేంద్రం.

తాజాగా ఈ సాయాన్ని రెట్టింపు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. అంటే రూ.6 వేలకు బదులుగా రూ.12 వేలు ఇవ్వనుంది. దీంతో ప్రతి విడతలో రైతులకు రూ.2 వేలకు బదులుగా రూ.4 వేలు జమకానున్నాయి. దీపావళి నాటికి కేంద్రం దీనిపై అధికారికంగా ప్రకటన చేయనుందని తెలుస్తోంది.

Petrol : లీటర్ కేవలం రూ.1.50.. ఆ దేశంలో అగ్గిపెట్టె కంటే పెట్రోల్ చీప్

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్ధిదారులు త్వరలో 10వ విడత నగదు అందుకోనున్నారు. డిసెంబర్ 15న రైతుల ఖాతాల్లో నగదు జమ కానుందని సమాచారం. ఇప్పటివరకు దేశంలోని 11.37 కోట్ల మంది రైతులకు ప్రభుత్వం రూ.1.58 లక్షల కోట్లను బదిలీ చేసింది.

Turmeric : పసుపుతో క్యాన్సర్ చికిత్స సాధ్యమేనా!..

గతేడాది డిసెంబర్ 25న రైతుల ఖాతాల్లో డబ్బు జమ అయ్యింది. ఇక పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ప్రయోజనాలను పొందాలనుకునే రైతులు అక్టోబర్ 30 లోగా తమ పేర్లను నమోదు చేసుకోవాలి. పూర్తి వివరాలకు.. pmkisan.gov.in