Petrol : లీటర్ కేవలం రూ.1.50.. ఆ దేశంలో అగ్గిపెట్టె కంటే పెట్రోల్ చీప్

లీటర్ పెట్రోల్ ధర రూ.1.50 మాత్రమే అంటే నమ్ముతారా? అగ్గిపెట్టె ధర కన్నా పెట్రోల్ ధర చాలా చీప్ అని చెబితే విశ్వసిస్తారా? అస్సలు నమ్మబుద్ధి కావడం లేదు కదూ. కానీ, ఇది నిజం.

Petrol : లీటర్ కేవలం రూ.1.50.. ఆ దేశంలో అగ్గిపెట్టె కంటే పెట్రోల్ చీప్

Petrol Very Cheap

Petrol Very Cheap : దేశంలో ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఇప్పటికే కొన్ని చోట్ల ఇంధన ధరలు సెంచరీ కొట్టేశాయి. అయినా ఇంకా వాటి పరుగు ఆగడం లేదు. రోజురోజుకి పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. భగ్గుమంటున్న ధరలతో సామాన్యులు విలవిలలాడిపోతున్నారు. వాహనాన్ని బయటకు తీయాలంటేనే భయపడుతున్నారు. ఈ ధరలతో వారికి నిద్ర కూడా పట్టడం లేదు. ఎలా బతకాలో అర్థం కాక ఆందోళన చెందుతున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో… లీటర్ పెట్రోల్ రూ.1.50కే దొరుకుతుంది అంటే నమ్ముతారా? అగ్గిపెట్టె ధర కన్నా పెట్రోల్ ధర చాలా చీప్ అని చెబితే విశ్వసిస్తారా? అస్సలు నమ్మబుద్ధి కావడం లేదు కదూ. కానీ, ఇది నిజం.

అగ్గిపెట్టె కన్నా పెట్రోల్ చీప్…
ఆ దేశంలో అగ్గిపెట్టె కొన్నంత ఈజీగా లీటర్ పెట్రోల్ కొనేయెచ్చు. ఆ దేశం పేరే వెనిజులా. దక్షిణ అమెరికా ఖండంలో ఉన్న ఈ లాటిన్‌ కంట్రీలో చమురు నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి. అమెరికా ఆయిల్‌ సరఫరాలు తీర్చడంలో ఈ దేశానిదే ముఖ్య పాత్ర. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని విలవిలాడుతున్నా పెట్రోలు కష్టాలయితే ఆ దేశాన్ని చుట్టుముట్టలేదు. వెనిజులాలో లీటర్ పెట్రోలు ధర 0.02 డాలర్లు. మన కరెన్సీలో అక్షరాల కేవలం రూపాయిన్నర (రూ.1.50) మాత్రమే. చమురు నిల‍్వలు ఎక్కువగా ఉండటంతో ఈ దేశం అత్యంత చవగ్గా తమ పౌరులకు పెట్రోలు, డీజిల్‌ అందిస్తోంది.

Five Drinks For Weight Loss : బరువు తగ్గడానికే కాదు..జీవక్రియకు ఉపయోపడే ఐదు అద్భుత పానీయాలు

ఒక వెనిజులా మాత్రమే కాదు.. మరో దేశమూ ఉంది. అక్కడా పెట్రోల్ అతి తక్కువ ధరకే అందిస్తున్నారు. అదే ఇరాన్‌. ఇక్కడ లీటర్ పెట్రోలు ధర 0.06 డాలర్లుగా ఉంది. అంటే మన కరెన్సీలో రూ.4.51. ఆ తర్వాత అంతర్యుద్ధంలో కొట్టుమిట్టాడుతున్న సిరియాలో 0.23 డాలర్లు (రూ.17)గా పెట్రోలు ధర ఉంది. వీటి తర్వాత అంగోలా, అల్జేరియా, కువైట్‌, నైజీరియా, తుర్క్‌మెనిస్తాన్‌, ఖజకిస్తాన్‌, ఇథియోపియా దేశాల్లో 0.50 డాలర్ల లోపే అంటే రూ.40లోపే లీటరు పెట్రోల్ ధర ఉంది.

అక్కడ లీటర్ పెట్రోల్ రూ.192..
పెట్రోల్ ధరలు భగ్గుమంటున్న దేశాలూ ఉన్నాయి. పెట్రోల్ ధర చాలా ఎక్కువగా ఉన్న దేశాల్లో మొదటి స్థానం హంగ్‌కాంగ్‌ది. చైనాలో అంతర్భాగం అయినప్పటికీ పెట్రోలు విషయంలో ఇక్కడ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇటీవల హాంగ్‌కాంగ్‌లో లీటరు పెట్రోలు ధర 2.56 డాలర్లుగా నమోదు అవుతోంది. అంటే మన కరెన్సీలో లీటరు పెట్రోలు ధర రూ.192ల దగ్గరగా ఉంది. హాంగ్‌కాంగ్ తర్వాత స్థానంలో నెదర్లాండ్స్‌ 2.18 డాలర్లు (రూ.163), సెంట్రల్‌ ఆఫ్రికా రిపబ్లిక్‌ 2.14 డాలర్లు (రూ.160)గా ఉన్నాయి. వీటి తర్వాత నార్వే, ఇజ్రాయిల్‌, డెన్మార్క్‌, మోనాకో, గ్రీస్‌, ఫిన్‌లాండ్‌, ఐస్‌లాండ్‌లలో లీటరు పెట్రోల్ కొనాలంటే మన కరెన్సీలో రూ. 150కి పైగానే చెల్లించాలి.

ORS : ప్రమాణాలు పాటించని ఓఆర్ఎస్ తో జాగ్రత్త!..

ఏడాదిన్నర కాలంలో రూ.36 పెంపు..
కరోనా సమయంలో డిమాండ్‌, సప్లయ్ మధ్య తేడాలు రావడంతో పెట్రోలు ధరలు ఒత్తిడికి లోనయ్యాయి. దీని మధ్య సమతూకం పేరుతో ఎక్సైజ్‌ ‍ డ్యూటీని కేంద్రం విధించింది. అప్పటి నుంచి మన దగ్గర ఇంధన ధరలకు అదుపు లేకుండా పోయింది. 2020 మే లో హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర రూ. 75 దగ్గర ఉండగా ప్రస్తుతం లీటరు పెట్రోలు ధర రూ.111లుగా ఉంది. అంటే, దాదాపు ఏడాదిన్నర కాలంలో లీటరు పెట్రోలు ధర భారీగా పెరిగింది.

పెట్రోల్ ధరలు పెంచడానికి అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలే కారణం అని కేంద్రం చెబుతోంది. అయితే క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. 2014లో అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ ‍క్రూడ్‌ ఆయిల్‌ ధర 109 డాలర్లుగా నమోదైంది. అ‍ప్పుడు లీటరు పెట్రోలు ధర నికరంగా రూ. 71లుగా ఉంది. 2021 అక్టోబర్ లో బ్యారెల్‌ ‍క్రూడ్‌ ఆయిల్‌ ధర 85 డాలర్లుగా ఉంది. అంటే ధర తగ్గింది. అందుకు అనుగుణంగా దేశంలోనూ పెట్రోల్ ధరలు తగ్గించాలి. కానీ, ప్రస్తుతం లీటరు పెట్రోలు రూ. 111 గా ఉంది.

Turmeric : పసుపుతో క్యాన్సర్ చికిత్స సాధ్యమేనా!..

మొత్తంగా పెరిగిపోతున్న ఇంధన ధరలతో దేశ ప్రజలు విలవిలలాడిపోతున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే.. ఇంధన ధరలు తగ్గించాలని తమకున్నా… అందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకోవడం లేదని కేంద్రం ఆరోపిస్తోంది. అంతేకాదు, ఇప్పటిల్లో ఇంధన ధరలు తగ్గించడం కుదరదని కేంద్రం తేల్చి చెప్పింది. ఇందుకు గత ప్రభుత్వం చేసిన తప్పిదాలే కారణం అంటోంది.