ORS : ప్రమాణాలు పాటించని ఓఆర్ఎస్ తో జాగ్రత్త!..

డబ్ల్యుహెచ్ వో సూచించిన ఫార్ములా కాకుండా ఇతర ఫార్ములతో కూడిన ఒఆర్ ఎస్ ను వినియోగించటం వల్ల ముఖ్యంగా చిన్నారుల్లో సమస్య తగ్గకపోగా మరింత జఠిలమయ్యే ప్రమాదం ఉంటుంది.

ORS : ప్రమాణాలు పాటించని ఓఆర్ఎస్ తో జాగ్రత్త!..

Ors

Ors : మన శరీరంలోకి ప్రవేశించే నీటి కంటే మన శరీరం నుంచి బయటికి వెళ్లిపోయే నీటి శాతం ఎక్కువైతే డీహైడ్రేషన్ సమస్య వస్తుంది. శరీరంలో నీటి శాతం తగినంత లేకపోతే అనేక సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. ప్రధానంగా అతిసార సమయంలో వాంతులు, విరోచనాల సమయంలో మన శరీరం నుండి ఎక్కవగా నీరు బయటకు వెళ్ళిపోతుంది. ఆసమయంలో నీరసించి పోతాం. ముఖ్యంగా చిన్నారుల్లో ఈ సమస్యలు ఎదురైన సందర్భాల్లో వారిని నీరసం నుండి బయటపడేలా చేసేందుకు ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్ (ఒఆర్ఎస్) వాటర్ ను తాగిస్తుంటాం. అయితే మనం మెడికల్ షాపుల్లో కొనుగోలు చేస్తున్న ఒఆర్ ఎస్ ప్యాకెట్ నాణ్యత విషయంలో ప్రస్తుతం అనేక సందేహాలు వ్యక్తమౌతున్నాయి.

అమెరికాతో-పాక్ కొత్త ఒప్పందం..ఎవరిని దెబ్బ తీయడానికి..?

ప్రపంచ ఆరోగ్య సంస్ధ అనుమతి పొందిన ఒఆర్ ఎస్ ఫార్ములతో కూడిన ప్యాకెట్లను మాత్రమే వినియోగించాలన్న విషయం చాలా మందికి తెలియదు. అయితే ప్రస్తుతం మార్కెట్లోకి వివిధ రకాల బ్రాండ్లతో ఒఆర్ ఎస్ ప్యాకెట్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే వాటి నాణ్యతా ప్రమాణాలపై అనేక సందేహాలు వ్యక్తమౌతున్నాయి. సాధారణంగా ప్రపంచ ఆరోగ్యసంస్ధ గుర్తింపు ఉన్న ఒఆర్ ఎస్ ప్యాకెట్లో గ్లూకోజ్, సోడియం, పొటాషియం, క్లోరైడ్ మొదలైన లవనాలు ఉంటాయి. గ్లూకోజ్, సోడియం శరీరంలో శోషణ చెందటానికి అవసరమైన పరిమాణంలోనే ఉంటుంది. అయితే ఇతర టెట్రాప్యాకెట్లలో లవణాల మోతాదులు అందుకు భిన్నంగా ఉన్నట్లు తెలుస్తుంది.

Indian Currency : రూ.2000 నోటుపై నల్లటి గీతలు.. ఇవి ఎందుకోసమో ఎప్పుడైనా ఆలోచించారా..?

డబ్ల్యుహెచ్ వో సూచించిన ఫార్ములా కాకుండా ఇతర ఫార్ములతో కూడిన ఒఆర్ ఎస్ ను వినియోగించటం వల్ల ముఖ్యంగా చిన్నారుల్లో సమస్య తగ్గకపోగా మరింత జఠిలమయ్యే ప్రమాదం ఉంటుంది. డీహైడ్రేషన్ పెరిగి పరిస్ధితి విషమించే ప్రమాదం ఉంటుందని గమనించాలి. ఒ ఆర్ ఎస్ ప్యాకెట్లను కొనుగోలు చేసే ముందు ఒక్కసారి వాటిపై ప్రపంచ ఆరోగ్య సంస్ధ అనుమతి ఉందో లేదో పరిశీలించాలి. కొత్త కొత్త లేబుళ్ళతో ప్రమాణాలకు విరుద్ధంగా అయోమయానికి గురిచేసే ఒఆర్ ఎస్ ప్యాకెట్ల విషయంలో జాగ్రత్త వహించటం మంచిదని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ఎలెక్ట్రాల్, వాలైట్, రాన్ బాక్సీ ఒఆర్ ఎస్, వాలైట్ ఒఆర్ ఎస్, సిప్లా ఒఆర్ ఎస్ వంటివి మాత్రమే ప్రపంచ ఆరోగ్య సంస్ద గుర్తింపు పొందాయి. మిగిలిన బ్రాండ్లన్నీ ప్రపంచ ఆరోగ్య సంస్ధ ఆమోదం పొందకుండానే మార్కెట్లో ఫుడ్ అండ్ సెఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆమోదంతో ఒఆర్ ఎస్ ను తలపించేలా అమ్మకాలు సాగిస్తున్నాయి.