బౌండరీ వద్ద ఒంటి చేత్తో అక్షర్ పటేల్ అద్భుత క్యాచ్.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే..

అక్షర్ పటేల్ బౌండరీ లైన్ వద్ద అద్భుత క్యాచ్ అందుకున్నాడు. కుల్ దీప్ వేసిన తొమ్మిదో ఓవర్ చివరి బంతికి మిచెల్ మార్ష్ భారీ షాట్ కొట్టాడు. ఆ బాల్ బౌండరీ ...

T20 World Cup 2024 : టీ20 వరల్డ్ కప్ సూపర్ -8లో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం సాధించింది. 24 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 41 బంతుల్లో 92 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. 206 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 181 పరుగులే చేసి ఓటమి పాలైంది. భారత బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్ 3 వికెట్లు, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టాడు. బుమ్రా, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీశారు.

Also Read : IND vs AUS: ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం

206 పరుగుల లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు.. మొదటి నుంచి దూకుడుగా ఆడుతూ వచ్చింది. వార్నర్ (6) ఔట్ అయినప్పటికీ.. హెడ్, మిచెల్ మార్ష్ దూకుడుగా ఆడారు. భారత్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. దీంతో ఆసీస్ స్కోర్ సైతం జెట్ స్పీడ్ తో పెరుగుతూ వెళ్లింది. ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ జోడీ ప్రమాదకరంగా మారుతున్న క్రమంలో అక్షర్ పటేల్ బౌండరీ లైన్ వద్ద అద్భుత క్యాచ్ అందుకున్నాడు. కుల్ దీప్ వేసిన తొమ్మిదో ఓవర్ చివరి బంతికి మిచెల్ మార్ష్ భారీ షాట్ కొట్టాడు. ఆ బాల్ బౌండరీ లైన్ బయట పడుతుండగా.. బౌండరీ లైన్ వద్ద ఉన్న అక్షర్ పటేల్ చివరి క్షణంలో గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో బాల్ ను అందుకున్నాడు. దీంతో స్టేడియంలోని ఆటగాళ్లు, ప్రేక్షకులతో పాటు, టీవీల ముందుకూర్చున్న క్రీడాభిమానులు సైతం షాక్ కు గురయ్యారు.

Also Read : Gautam Gambhir : రోహిత్, కోహ్లిల‌కు గంభీర్ చెక్‌..! బీసీసీఐ ముందు కీల‌క డిమాండ్లు.. ఒకే చెప్పిన బోర్డు..!

అక్షర్ క్యాచ్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ క్యాచ్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. తొమ్మిది ఓవర్లు పూర్తయ్యే వరకు ఆస్ట్రేలియా పటిష్ట స్థితిలో ఉంది.. అక్షర్ పటేల్ క్యాచ్ అందుకున్న తరువాత మ్యాచ్ పూర్తిగా భారత్ జట్టు ఆధీనంలోకి వచ్చేసింది.

 

ట్రెండింగ్ వార్తలు