T20 World Cup : క్రికెట్ ఫ్యాన్స్‌కు భారీ శుభవార్త.. రూ.100 చెల్లిస్తే చాలు.. వరల్డ్‌కప్ మ్యాచ్‌లను స్టేడియంకెళ్లి చూడొచ్చు.. ఇలా బుక్ చేసుకోండి
T20 World Cup : క్రికెట్ ఫ్యాన్స్‌కు భారీ శుభవార్తను అందిస్తూ అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి (ఐసీసీ) సంచలన నిర్ణయం తీసుకుంది.
T20 World Cup
T20 World Cup : టీ20 పురుషుల ప్రపంచ కప్ వచ్చే ఏడాది జరగనుంది. ఈ మెగా ఈవెంట్‌ను భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి టీ20 వరల్డ్ కప్ (T20 World Cup) టోర్నీ ప్రారంభం అవుతుంది. పాకిస్థాన్, నెదర్లాండ్ జట్ల మధ్య జరిగే తొలి మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ షురూ అవుతుంది. అదేరోజు ముంబైలోని వాంఖడే వేదికగా జరిగే భారత్ -అమెరికా మ్యాచ్‌తో టీమిండియా తన ప్రయాణం మొదలు పెడుతుంది.
Also Read : IND vs SA T20 Match : మేం చేసిన పెద్ద తప్పు ఇదే.. అందుకే ఓడాం.. కెప్టెన్ సూర్యకుమార్ కీలక కామెంట్స్
ఈ మెగా టోర్నీకి టికెట్ల విక్రయం గురువారం సాయంత్రం నుంచి ఆన్‌లైన్‌లో ప్రారంభమైంది. ఈ క్రమంలో క్రికెట్ ఫ్యాన్స్‌కు భారీ శుభవార్తను అందిస్తూ అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి (ఐసీసీ) సంచలన నిర్ణయం తీసుకుంది.
టీ20 పురుషుల వరల్డ్‌కప్ మ్యాచ్‌ను స్టేడియంకు వెళ్లి వీక్షించేందుకు అభిమానులు ఎదురుచూస్తున్నారు. అలాంటి వారికోసం ఐసీసీ భారీ శుభవార్తను అందించింది. ఐసీసీ సీఈఓ సనోజ్ గుప్త వెల్లడించిన వివరాల ప్రకారం.. అభిమానులను భారీగా స్టేడియాలకు రప్పించాలనే ఉద్దేశంతో ఈసారి మ్యాచ్ ల టికెట్లను కనీస ధరలు కేవలం రూ.100గా నిర్ణయించామని తెలిపారు. ఈ టికెట్లు టోర్నీ అధికారిక భాగస్వామి బుక్‌మై షోలో అందుబాటులో ఉన్నాయని సీఈఓ సనోజ్ గుప్త తెలిపారు.
ఈ టోర్నీకి సంబంధించిన మ్యాచ్‌లు భారత్‌లోని వాంఖడేతో పాటు చెన్నైలోని చెపాక్ స్టేడియం, కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం, ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతాయి. అదేవిధంగా శ్రీలంకలో కొలంబోలోని రెండు స్టేడియాల్లో టీ20 ప్రపంచకప్ మ్యాచ్ లు నిర్వహిస్తున్నారు. ఈ స్టేడియాల్లో మ్యాచ్ ను వీక్షించాలనుకునే వారికోసం టికెట్ల కనీస ధరలు కేవలం రూ.100గా ఐసీసీ నిర్ణయించింది.
𝗧𝗛𝗘 𝗧𝗜𝗖𝗞𝗘𝗧𝗦 𝗔𝗥𝗘 𝗢𝗨𝗧 🎟️
At historic low entry-level prices, witness the world’s best in action at the ICC Men’s #T20WorldCup 2026 in India and Sri Lanka ➡️ https://t.co/MSLEQzcObb pic.twitter.com/iMBPdpixMf
— ICC (@ICC) December 11, 2025
2026 T20 ప్రపంచ కప్ టిక్కెట్లను ఎలా బుక్ చేసుకోవాలి?
♦ నమోదు లాగిన్
♦ మ్యాచ్/వేదికను ఎంచుకోండి
♦ మీకు ఇష్టమైన మ్యాచ్‌ను ఎంచుకోండి
♦ పేజీని రిఫ్రెష్ చేయవద్దు
♦ సీట్లు, తరగతి మరియు టిక్కెట్ల సంఖ్యను ఎంచుకోండి
♦ కార్డ్, UPI, నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి చెల్లించండి
♦ మీరు ఒక ఇమెయిల్ మరియు SMS నిర్ధారణ సందేశాన్ని అందుకుంటారు.
