T20 World Cup 2026 : టాస్ గెలిచిన నెదర్లాండ్స్.. నమీబియా ఫస్ట్ బ్యాటింగ్
టీ20 ప్రపంచకప్ 2026లో (T20 World Cup 2026) భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా నెదర్లాండ్స్, నమీబియా జట్లు తలపడుతున్నాయి.
T20 World Cup 2026 Netherlands opt to bowl against Namibia
T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా నెదర్లాండ్స్, నమీబియా జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన నెదర్లాండ్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో నమీబియా జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది.
‘మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. ఉదయం కావడంతో వికెట్ పై తేమ ఉండే అవకాశం ఉంది. మేం దాన్ని సద్వినియోగం చేసుకోవాలని అనుకుంటున్నాము. పాక్‌తో మ్యాచ్‌లో మేం మంచి క్రికెట్ ఆడామని అనుకుంటున్నాము. కొన్ని తప్పులు చేయడంతో ఓడిపోయాం. వాటిని మరోసారి చేయకుండా ఉంటాం. ఈ మ్యాచ్ ద్వారా మా తప్పులను సరిచేసుకుంటాం. తుది జట్టులో రెండు మార్పులు ఉన్నాయి. ఫ్రెడ్ క్లాసెన్, టిమ్ వాన్ డెర్ గుగ్టెన్ లు జట్టులోకి వచ్చారు.’ అని నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ తెలిపాడు.
‘పిచ్, పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటే టాస్ గెలిచి ఉంటే మేం కూడా ముందుగా బౌలింగ్ చేసేవాళ్లం. అయినప్పటికి ఏం కాదు. బ్యాటింగ్‌లో మంచి స్కోరు సాధించి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెడతాం. దుబాయ్‌లో ఏడు రోజులు పాటు ట్రైనింగ్ సెషన్స్ నిర్వహించాము. ఆ తరువాత బెంగళూరులోని ఎక్స్‌లెన్స్‌లో చక్కటి ప్రాక్టీస్ చేశాము. విల్లెం మైబర్గ్ అరంగేట్రం చేస్తున్నాడు.’ అని నమీబియా కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ తెలిపాడు.
నమీబియా తుది జట్టు..
లౌరెన్ స్టీన్‌క్యాంప్, జాన్ ఫ్రైలింక్, జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్, గెర్హార్డ్ ఎరాస్మస్(కెప్టెన్), జెజె స్మిట్, జేన్ గ్రీన్(వికెట్ కీపర్), డైలాన్ లీచెర్, రూబెన్ ట్రంపెల్మాన్, విల్లెం మైబర్గ్, బెర్నార్డ్ స్కోల్ట్జ్, మాక్స్ హీంగో.
నెదర్లాండ్స్ తుది జట్టు..
మైఖేల్ లెవిట్, మాక్స్ ఓడౌడ్, బాస్ డి లీడ్, కోలిన్ అకెర్మాన్, స్కాట్ ఎడ్వర్డ్స్(కెప్టెన్), జాచ్ లయన్ క్యాచెట్, లోగాన్ వాన్ బీక్, ఆర్యన్ దత్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, టిమ్ వాన్ డెర్ గుగ్టెన్, ఫ్రెడ్ క్లాసెన్.
