T20 World Cup 2026 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాక్.. నెదర్లాండ్స్ బ్యాటింగ్..
టీ20 ప్రపంచకప్ 2026లో (T20 World Cup 2026) భాగంగా కొలంబో వేదికగా పాకిస్తాన్, నెదర్లాండ్స్ జట్లు తలపడుతున్నాయి.
T20 World Cup 2026 Pakistan opt to bowl against Netherlands
T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్, నెదర్లాండ్స్ జట్లు తలపడుతున్నాయి. కొలంబోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ ఈ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తోంది. టాస్ గెలిచిన పాకిస్తాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో నెదర్లాండ్స్ తొలుత బ్యాటింగ్ చేయనుంది.
‘మేము ముందుగా బౌలింగ్ చేస్తాము. ఇది కొత్త పిచ్. కొద్ది రోజులుగా ఇక్కడ వర్షం పడుతోంది. పిచ్ పై తేమ ఉండొచ్చు. దాన్ని మేము ఉపయోగించుకోవాలని అనుకుంటున్నాము. పిచ్ పై కాస్త పచ్చిక ఉంది. పేసర్లతో పాటు స్పిన్నర్లు రాణిస్తారని అనుకుంటున్నాను. నెదర్లాండ్స్ మంచి జట్టు. వారు మంచి క్రికెట్ ఆడారు. మేము మా బలాలపై దృష్టి పెట్టి ఆడతాము. మా ప్రణాళికలను మైదానంలో సరిగ్గా అమలు చేస్తే ఏ జట్టునైనా ఓడిస్తాం.’ అని పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా అన్నాడు.
T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌కు ముందు భారత్‌కు భారీ షాక్.. బుమ్రా దూరం
‘టాస్ గెలిస్తే మేము కూడా బౌలింగ్ ఎంచుకోవాలని అనుకున్నాము. అయినప్పటికి తొలుత బ్యాటింగ్ చేయడం సంతోషంగానే ఉంది. పిచ్ చాలా బాగుంది. లీగ్ దశలో మేము నాలుగు మ్యాచ్‌లు ఆడతాము. తదుపరి దశకు చేరుకోవాలంటే కనీసం మూడు మ్యాచ్‌లు గెలవాల్సి ఉంటుంది. ఇది మాకు ఓ పెద్ద మ్యాచ్. మేము గెలిచేందుకు కృషి చేస్తాం. మేము శ్రీలంకలో పరిస్థితులకు అలవాటు పడ్డాము. జట్టులో ఆల్రౌండర్లకు కొదవ లేదు.’ అని నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ తెలిపాడు.
పాకిస్తాన్ తుది జట్టు..
సైమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, సల్మాన్ అఘా(కెప్టెన్), బాబర్ ఆజామ్, ఉస్మాన్ ఖాన్(వికెట్ కీపర్), షాదాబ్ ఖాన్, మొహమ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, సల్మాన్ మీర్జా, అబ్రార్ అహ్మద్.
U19 World Cup 2026 : అండర్ 19 విజేతగా నిలిచిన భారత్‌కు ప్రైజ్‌మనీగా ఒక్క రూపాయి ఇవ్వని ఐసీసీ..
నెదర్లాండ్స్ తుది జట్టు..
మైఖేల్ లెవిట్, మాక్స్ ఓడౌడ్, బాస్ డి లీడే, కోలిన్ అకెర్మాన్, స్కాట్ ఎడ్వర్డ్స్(కెప్టెన్), జాచ్ లయన్ క్యాచెట్, లోగాన్ వాన్ బీక్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, ఆర్యన్ దత్, కైల్ క్లైన్, పాల్ వాన్ మీకెరెన్
