T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్‌లో బోణీ కొట్టిన పాకిస్థాన్.. చచ్చీ చెడీ పసికూన నెదర్లాండ్స్ పై విజయం
టీ20 ప్రపంచకప్ 2026లో (T20 World Cup 2026) పాకిస్థాన్ శుభారంభం చేసింది.
T20 World Cup 2026 Pakistan won by 3 wickets against Netherlands
T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ 2026లో పాకిస్థాన్ శుభారంభం చేసింది. శనివారం నెదర్లాండ్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో పాక్ మూడు వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ జట్టు 19.5 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. నెదర్లాండ్స్ బ్యాటర్లలో కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్(37; 29 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), బాస్ డీ లీడే(30; 25 బంతుల్లో 4 ఫోర్లు) రాణించారు. పాక్ బౌలర్లలో సల్మాన్ మిర్జా మూడు వికెట్లు తీశాడు. మహమ్మద్ నవాజ్, అబ్రర్ అహ్మద్, సయీమ్ ఆయూబ్ తలా రెండేసి వికెట్లు పడగొట్టారు. షాహీన్ షా అఫ్రిది ఓ వికెట్ తీశాడు.
T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్‌లో ఐర్లాండ్‌తో మ్యాచ్‌కు ముందు శ్రీలంకకు భారీ షాక్..
ఆ తరువాత 148 పరుగుల లక్ష్యాన్ని ఫాక్ జట్టు 19.3 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. లక్ష్య ఛేదనలో ఓ దశలో 114 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోవడంతో పెను సంచలనం నమోదు అవుతుందేమోనని అనిపించింది. అయితే.. ఆఖరిలో ఫహీమ్ అఫ్రష్ (29 నాటౌట్; 11 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు) వేగంగా ఆడి పాక్‌ను ఓటమి ముప్పు నుంచి గట్టెక్కించాడు. పాక్ బ్యాటర్లలో షాహిబ్జాదా ఫర్హాన్(31 బంతుల్లో 47 పరుగులు) రాణించగా, కెప్టెన్ సల్మాన్ అఘా (12), బాబర్ ఆజామ్ (15)లు విఫలం అయ్యారు. నెదర్లాండ్స్ బౌలర్లలో ఆర్యన్ దత్, పాల్ వాన్ మీకెరెన్ చెరో రెండు వికెట్లు తీశారు. లోగాన్ వాన్ బీక్, కైల్ క్లైన్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే తలా ఓ వికెట్ పడగొట్టారు.
19 ఓవర్లో 24 పరుగులు..
లక్ష్య ఛేదనలో 18 ఓవర్లు ముగిసే సరికి పాక్ ఏడు వికెట్లు కోల్పోయి 119 పరుగుతో ఉంది. 19వ ఓవర్‌ను లోగాన్ వాన్ బీక్ వేశాడు. ఈ ఓవర్లో తొలి బంతికి ఫహీమ్ సిక్స్ కొట్టాడు. అయితే రెండో బంతికి అతడు ఇచ్చిన క్యాచ్‌ను మాక్స్ ఓ’డౌడ్ మిస్ చేశాడు. ఈ సమయంలో ఫహీమ్ రెండు పరుగులు తీశాడు.
T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌కు ముందు భారత్‌కు భారీ షాక్.. బుమ్రా దూరం
తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న అతడు ఆ తరువాత రెండు సిక్సర్లు, ఓ ఫోర్ బాదాడు. మొత్తంగా ఈ ఓవర్లో 24 పరుగులను పిండుకున్నాడు. దీంతో మ్యాచ్ పాక్ వైపు టర్న్ అయింది. ఫహీమ్ క్యాచ్ పట్టి ఉంటే నెదర్లాండ్స్ సంచలన విజయం సాధించి ఉండేది.
