×
Ad

T20 World Cup 2026 schedule : టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ 2026 షెడ్యూల్ నేడే రిలీజ్.. భారత్, పాక్ మ్యాచ్ ఆ రోజేనా?

ఐసీసీ టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026 షెడ్యూల్ (T20 World Cup 2026 schedule ) ను మ‌రికొన్ని గంట‌ల్లో ఐసీసీ విడుద‌ల చేయ‌నుంది.

T20 WORLD CUP 2026 SCHEDULE WILL BE ANNOUNCED TODAY

T20 World Cup 2026 schedule : క్రికెట్ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న ఐసీసీ టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026 షెడ్యూల్ ను మ‌రికొన్ని గంట‌ల్లో ఐసీసీ విడుద‌ల చేయ‌నుంది. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి 7 నుంచి మార్చి 8 వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న ఈ మెగాటోర్నీకి భార‌త్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వ‌నున్నాయి. ఇక ఈ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ నేటి (న‌వంబ‌ర్ 25, సోమ‌వారం) సాయంత్రం 6.30 గంట‌ల‌కు విడుద‌ల కానుంది.

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026 టోర్నీలో గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ఏకంగా 20 జ‌ట్లు భారత్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌, యూఏఈ, ఒమన్‌, వెస్టిండీస్‌, యూఎస్‌ఏ, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వే, ఐర్లాండ్‌, ఇంగ్లాండ్‌, నెదర్లాండ్స్‌, ఇటలీ, నేపాల్‌, పాకిస్థాన్ లు క‌ప్పు కోసం పోటీప‌డనున్నాయి.

IND vs SA : క్రికెట్ చ‌రిత్ర‌లోనే ఏ జ‌ట్టుకు సాధ్యం కాని రికార్డుపై క‌న్నేసిన ద‌క్షిణాఫ్రికా.. గంభీర్ ప‌ని గోవిందా!

ఈ 20 జ‌ట్ల‌ను నాలుగు గ్రూపులుగా విభ‌జించ‌నున్నారు. ఒక్కొ గ్రూపులో 5 జ‌ట్లు ఉండ‌నున్నాయి. ప్ర‌తి గ్రూప్ లో టాప్‌-2లో నిలిచిన జ‌ట్లు సూప‌ర్‌-8కి చేరుకుంటాయి. ఇక సూప‌ర్‌-8లో చేరుకునే 8 జ‌ట్ల‌ను మ‌ళ్లీ నాలుగేసి జ‌ట్ల చొప్పున రెండు గ్రూప్‌లు విభ‌జించ‌నున్నారు. మ‌ళ్లీ ఆయా గ్రూపుల‌ల్లో టాప్‌-2లో నిలిచిన జ‌ట్లు సెమీస్‌కు చేరుకుంటాయి. సెమీస్‌లో విజ‌యం సాధించిన జ‌ట్లు ఫైన‌ల్‌లో త‌ల‌ప‌డ‌తాయి.

Yashasvi Jaiswal : ఉస్మాన్ ఖవాజా, జాక్ క్రాలీ రికార్డులు బ్రేక్‌.. య‌శ‌స్వి జైస్వాల్ అరుదైన మైలురాయి..

అందుతున్న స‌మాచారం ప్రకారం.. భార‌త్‌, పాక్ జట్లు ఒకే గ్రూప్‌లో ఉండ‌నున్నాయి. క్రికెట్ ప్రేమికులు ఎంత‌గానో ఎద‌రుచూసే భార‌త్, పాక్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ ఫిబ్ర‌వ‌రి 15 జ‌ర‌గ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్‌కు కొలంబో ఆతిథ్యం ఇవ్వ‌నుంది.