Team India batting and fielding coaches sacked after Australia series debacle
వన్డేల్లో, టీ20ల్లో భారత జట్టు ప్రదర్శనకు వంక పెట్టలేము. గతేడాది టీ20 ప్రపంచకప్, ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని కైవసం చేసుకుంది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ప్రదర్శన బాగానే ఉన్నప్పటికి గతకొన్నాళ్లుగా టెస్టుల్లో టీమ్ఇండియా ప్రదర్శన ఆశాజనకంగా లేదు. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో టెస్టు సిరీస్ (3-0తో) ఓటమి, ఆ తరువాత ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 1-3 తేడాతో టెస్టు సిరీస్ లను కోల్పోయింది.
ఈ క్రమంలో భారత జట్టులో మార్పులు తప్పవని ఆసీస్‌తో సిరీస్ ఓడిపోనప్పుడే బీసీసీఐ సూచనప్రాయంగా వెల్లడించింది. అయితే.. ఛాంపియన్స్ ట్రోఫీ ఉండడంతో కాస్త సమయం తీసుకుంది. ఇక జూన్‌లో భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుండంతో మార్పులు చేయాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.
IPL 2025 : సలైవా గేమ్ ఛేంజరా? సూపర్ ఓవర్ హీరో మిచెల్ స్టార్క్ షాకింగ్ ఆన్సర్..
ఇంగ్లాండ్ పర్యటనకు ఇంకా రెండు నెలల సమయం ఉన్నప్పటికి కూడా కోచింగ్ బృందంలో మార్పులకు బీసీసీఐ శ్రీకారం చుట్టింది. అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్, ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్, కండీషనింగ్ కోచ్ సోహమ్ దేశాయ్‌లపై వేటుపడింది.
ఇప్పటికే బ్యాటింగ్ కోచ్ గా సితాన్షు కోటక్, బౌలింగ్ కోచ్‌గా మోర్నీ మోర్కెల్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌కు సహాయకుడిగా అసిస్టెంట్ కోచ్ టెన్ దస్కటే ఉండనే ఉన్నాడు. ఈ క్రమంలోనే మరో అసిస్టెంట్ కోచ్ అవసరం లేదు అని భావించి అభిషేక్‌ను తప్పించినట్లుగా తెలుస్తోంది.
DC vs RR : ఏందీ భయ్యా.. ఇక్కడ కూడానా.. సూపర్ ఓవర్‌లో పరాగ్ కామెడీ రనౌట్.. వీడియో వైరల్
వీరి స్థానాల్లో ఎవరినైనా భర్తీ చేస్తారా? లేదా? అన్నది ప్రస్తుతానికి తెలియరాలేదు. ఇంగ్లాండ్ పర్యటనకు ముందు దీనిపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో ఆటగాళ్ల పై వేటు పడే అవకాశం ఉందా? రోహిత్ శర్మ, కోహ్లీ ల టెస్టు భవిష్యత్తు ఏంటి అనేది ఇంగ్లాండ్ పర్యటనకు ముందే తెలిసే అవకాశం ఉంది.
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జూన్ 20 నుంచి ప్రారంభం కానుంది.