Team India cricketer Nitish Kumar Reddy
Nitish Reddy: బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్ లో టీమిండియా ఆల్ రౌండర్, తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి అదరగొట్టాడు. ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా మెల్ బోర్న్ క్రికెట్ మైదానంలో జరిగిన టెస్టులో నితీశ్ రెడ్డి సెంచరీ చేశాడు. టీమిండియా బ్యాటర్లు పరుగులు రాబట్టడంలో విఫలమైన వేళ నితీశ్ రెడ్డి సూపర్ సెంచరీతో సత్తాచాటి క్రికెట్ అభిమానుల ప్రశంసలు అందుకున్నాడు. కాగా.. ఆస్ట్రేలియా టూర్ ముగించుకొని తన స్వగ్రామం విశాఖ పట్టణంకు చేరుకున్న నితీశ్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది.
Also Read: Catch Of The Year : నువ్వు మనిషివా.. పక్షివా..! గాల్లో అమాంతం డైవ్ చేస్తూ..
నితీశ్ కుమార్ రెడ్డి గురువారం రాత్రి విశాఖపట్టణం విమానాశ్రయంకు చేరుకున్నారు. నితీశ్ రెడ్డి రాకను తెలుసుకున్న క్రికెట్ అభిమానులు పెద్దెత్తున విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకొని ఘన స్వాగతం పలికారు. పూలమాలలు, శాలువలతో నితీశ్ రెడ్డిని ఘనంగా సత్కరించి, క్రికెట్ బ్యాట్ అందించారు. అనంతరం ఓపెన్ టాప్ జీపులో ఊరేగింపుగా స్వగృహానికి తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నితీశ్ శనివారం అకాడమిలో శిక్షణకు వెళ్లనున్నాడు. ఈనెల 22 నుంచి ఇంగ్లండ్ తో జరగనున్న టీ20లు, వన్డే మ్యాచ్ లకు ఎంపికయ్యే అవకాశం ఉంది.
Also Read; Virat Kohli : ప్రపంచ రికార్డుపై కోహ్లీ కన్ను.. వన్డేల్లో మరో 96 పరుగులు చేస్తే..
ఆస్ట్రేలియా టూర్ లో భాగంగా నాల్గో టెస్టు మెల్బోర్న్ క్రికెట్ మైదానంలో జరిగిన విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్ లో నితీశ్ రెడ్డి సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ చేసిన తరువాత ‘పుష్ప’ సినిమాలో హీరో అల్లు అర్జున్ సిగ్నేచర్ స్టైల్‌లో తగ్గేదేలే అంటూ బ్యాట్‌తో గడ్డాన్ని సవరించాడు. సెంచరీ పూర్తి చేసిన తరువాత.. ‘బాహుబలి’ సినిమాలో ప్రభాష్ మాదిరిగా బ్యాట్ ను నేలకు ఆనించి.. పైకి చూసి దేవుడ్ని తలచుకున్నాడు. అతడికి బ్యాటింగ్, టాలీవుడ్ పొగరు చూపిస్తూ చేసిన సెలబ్రేషన్స్, స్వాగ్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరోవైపు వరుసగా వికెట్లు కోల్పోతున్న వేళ నితీశ్ రెడ్డి సెంచరీ చేయడంతో అతనిపై మాజీ క్రికెటర్లు, క్రికెట్ అభిమానులు ప్రశంసల జల్లు కురిపించారు. బోర్డర్ గావస్కర్ ట్రోపీలో నితీశ్ ఐదు టెస్టుల్లో 37.25 సగటుతో 298 పరుగులు చేశాడు. ఈ సిరీస్ లో భారత తరపున అత్యధిక పరుగులు చేసిన వారిలో నితీశ్ రెండో స్థానంలో నిలిచాడు. అంతేకాదు.. బౌలింగ్ లోనూ ఐదు వికెట్లు తీశాడు.
నితీశ్ రెడ్డికి విశాఖ ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఓపెన్ టాప్ జీపుపై ఊరేగింపుగా తన నివాసానికి తీసుకెళ్లారు. ఓపెన్ టాప్ జీపులో ముందు సీట్లో నితీశ్ రెడ్డి కూర్చోగా.. వెనుక ఆయన తండ్రి ముత్యాలరెడ్డి ఉన్నారు. నితీశ్ నివాసం గాజువాకలో ఉంది. ఎయిర్ పోర్టు నుంచి గాజువాక వరకు క్రికెట్ అభిమానులు నితీశ్ రెడ్డిని ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ క్రమంలో రోడ్డుపొడవునా అభిమానులు నితీశ్ తో కరచాలనం ఇచ్చేందుకు పోటీ పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
THE HERO WELCOME FOR NITISH KUMAR REDDY AT VIZAG 🙇
– The future of Team India. pic.twitter.com/jQufZnT8cz
— Johns. (@CricCrazyJohns) January 9, 2025