Champions Trophy 2025 : ఫైన‌ల్‌కు భార‌త్‌.. పాక్ ఆశ‌లు ఆవిరి.. మొన్న జ‌ట్టు.. ఇప్పుడు ట్రోఫీ.. మీమ్స్ వైర‌ల్‌..

ఛాంపియ‌న్స్ ట్రోఫీ ఫైన‌ల్‌లో భార‌త్ ప్ర‌వేశించ‌డంతో పాకిస్తాన్ పై ప్ర‌స్తుతం మీమ్స్ వ‌ర్షం కురుస్తోంది.

Team India Enter into Champions Trophy 2025 Final then memes over pakistan

భార‌త జ‌ట్టు ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025లో ఫైన‌ల్‌కు చేరుకుంది. సెమీస్‌లో ఆస్ట్రేలియాపై నాలుగు వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. కాగా..ఈ టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తోంది. భ‌ద్ర‌తా కార‌ణాల దృష్ట్యా భార‌త జ‌ట్టును పాక్ కు పంపే అవ‌కాశాలు లేవ‌ని బీసీసీఐ చెప్ప‌డంతో టీమ్ఇండియా ఆడే మ్యాచ్‌ల‌ను దుబాయ్ వేదిక‌గా నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు భార‌త జ‌ట్టు ఫైన‌ల్‌కు చేరుకోవ‌డంతో ఫైన‌ల్ మ్యాచ్ దుబాయ్ వేదిక‌గానే జ‌ర‌గ‌నుంది.

పాకిస్తాన్ జ‌ట్టు ఛాంపియ‌న్స్ ట్రోఫీలో పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న చేసింది. దీంతో ఆ జ‌ట్టు గ్రూప్ స్టేజీ నుంచే నిష్క్ర‌మించింది. క‌నీసం ఛాంపియ‌న్స్ ట్రోఫీ ఫైన‌ల్ మ్యాచ్ అయినా స్వ‌దేశంలో నిర్వ‌హించి అభిమానుల‌ను కాస్త శాంత‌ప‌ర‌చాల‌ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భావించింది.

IND vs AUS : సెమీస్‌లో ఆసీస్ పై విజ‌యం.. మాజీ కోచ్ ర‌విశాస్త్రి చేతుల మీదుగా బెస్ట్ ఫీల్డ‌ర్ మెడ‌ల్ అందుకుంది ఎవ‌రంటే?

అయితే.. భార‌త జ‌ట్టు దెబ్బ‌కు పాక్ ప్లాన్ బెడిసి కొట్టింది. టీమ్ఇండియా ఫైన‌ల్ చేరుకుంటే దుబాయ్‌లోనే ఫైన‌ల్ జ‌ర‌గ‌నుంద‌ని టోర్నీ ప్రారంభానికి ముందే ఐసీసీ వెల్ల‌డించింది.

భార‌త్ ఫైన‌ల్‌కు చేర‌కుంటే లాహోర్‌లోని గ‌డాఫీ స్టేడియం ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025 ఫైన‌ల్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇచ్చిఉండేది. ఈ విష‌యాన్ని గుర్తు చేస్తూ.. పాక్ పై సోష‌ల్ మీడియాలో మీమ్స్ వైర‌ల్ అవుతున్నాయి.

IND vs AUS : సెమీస్ లో సెంచ‌రీ మిస్ కావ‌డంపై విరాట్ కోహ్లీ కీల‌క వ్యాఖ్య‌లు.. శ‌త‌కం సాధిస్తే ఆనంద‌ప‌డేవాడిని కానీ..