IND vs AUS : సెమీస్‌లో ఆసీస్ పై విజయం.. మాజీ కోచ్ రవిశాస్త్రి చేతుల మీదుగా బెస్ట్ ఫీల్డర్ మెడల్ అందుకుంది ఎవరంటే?
సెమీస్ మ్యాచ్‌లో ఎవరు బెస్ట్ ఫీల్డర్ మెడల్ అందుకున్నారో అన్న ఆసక్తి అందరిలో ఉంది.

pic credit @bcci twitter
దుబాయ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో టీమ్ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఫైనల్‌కు చేరుకుంది. కాగా.. ఆసీస్‌తో సెమీస్ ఫైనల్ మ్యాచ్ లో అద్భుతంగా ఫీల్డింగ్ చేసి ఎవరు బెస్ట్ ఫీల్డర్ మెడల్ అందుకున్నారో అన్న ఆసక్తి చాలా మందిలో ఉంది.
టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేసింది. స్టీవ్ స్మిత్ (73), అలెక్స్ క్యారీ(61)లు హాఫ్ సెంచరీలతో రాణించడంతో 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటైంది. టీమ్ఇండియా బౌలర్లలో మహమ్మద్ షమీ మూడు వికెట్లు తీశాడు. వరుణ్ చక్రవర్తీ, రవీంద్ర జడేజా చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
అనంతరం లక్ష్య ఛేదనలో విరాట్ కోహ్లీ(84; 98 బంతుల్లో 5 ఫోర్లు)తో పాటు శ్రేయస్ అయ్యర్ (45), కేఎల్ రాహుల్(42 నాటౌట్), హార్దిక్ పాండ్యా(28)రాణించడంతో భారత్ 48.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి అందుకుంది. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడప్ జంపా, నాథన్ ఎల్లిస్‌లు చెరో రెండు వికెట్లు తీశారు. కూపర్ కొన్నోలీ, బెన్ ద్వార్షుయిస్ లు తలా ఓ వికెట్ సాధించారు.
𝗗𝗿𝗲𝘀𝘀𝗶𝗻𝗴 𝗥𝗼𝗼𝗺 𝗕𝗧𝗦 | 𝗙𝗶𝗲𝗹𝗱𝗲𝗿 𝗼𝗳 𝘁𝗵𝗲 𝗠𝗮𝘁𝗰𝗵 | #INDvAUS
It was a battle of heavyweights 💪
🎙️And there was just one voice that “roared” in the dressing room to announce the winner 🏅😎#TeamIndia | #ChampionsTrophyhttps://t.co/lA6G3SRlG4
— BCCI (@BCCI) March 5, 2025
బెస్ట్ ఫీల్డర్ మెడల్ ఎవరికంటే?
స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్ 2023 నుంచి భారత టీమ్‌మేనేజ్‌మెంట్ ఓ సరికొత్త సంప్రదాయానికి తెరతీసింది. ఆటగాళ్లను ప్రోత్సహించడానికి బెస్ట్ ఫీల్డర్ మెడల్‌ను తీసుకువచ్చింది. మ్యాచ్‌లో ఉత్తమ ఫీల్డింగ్ చేసిన ఆటగాడిని గుర్తించి బెస్ట్ ఫీల్డర్ మెడల్ ను అందిస్తూ వస్తోంది. ఇక ఈ సంప్రదాయాన్ని ఛాంపియన్స్ ట్రోఫీ 2025లోనూ కొనసాగిస్తోంది.
బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో వికెట్ కీపర్ కేఎల్ రాహుల్, పాక్‌తో మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ మెడల్, న్యూజిలాండ్‌తో మ్యాచ్ లో విరాట్ కోహ్లీలు బెస్ట్ ఫీల్డర్ మెడల్స్ అందుకున్నారు. ఇక ఆసీస్‌తో సెమీస్ మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ ఈ అవార్డును గెలుచుకున్నాడు.
టీమ్ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి భారత డ్రెస్సింగ్ రూమ్‌లోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ మెడలో బెస్ట్ ఫీల్డర్ మెడల్‌ను వేశాడు.
ఇదిలా ఉంటే.. భారత జట్టు ఆదివారం (మార్చి 9న) ఫైనల్ మ్యాచ్ ఆడనుంది.