IND vs AUS : కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఆల్ టైం రికార్డు.. ధోని, కోహ్లీల వల్ల కాలేదు..
కెప్టెన్‌గా రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు.

Rohit Sharma becomes first ever captain Record In ICC Events
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టు ఫైనల్‌కు దూసుకువెళ్లింది. సెమీస్‌లో ఆస్ట్రేలియా పై నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందిన తరువాత టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. అన్ని (నాలుగు ఐసీసీ టోర్నీల్లో) జట్టును ఫైనల్‌కు తీసుకువెళ్లిన ఏకైక సారథిగా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. మరే ఆటగాడు కూడా ఇప్పటి వరకు ఈ ఘనత సాధించలేదు. హిట్‌మ్యాన్ నాయకత్వంలో భారత్.. 2023 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్, 2023 వన్డే ప్రపంచకప్, 2024 టీ20 ప్రపంచకప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లకు భారత్‌కు చేరింది.
కాగా.. ఇందులో 2024 టీ20 ప్రపంచకప్ విజేతగా భారత్ నిలిచింది. మిగిలిన రెండు ఫైనల్స్‌లో భారత్ ఓడిపోయింది. 2023 ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్, 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్స్‌లో భారత్ ఆస్ట్రేలియా చేతుల్లో ఓడిపోయింది. రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్ మార్చి 9 (ఆదివారం) జరగనుంది. బుధవారం దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనున్న రెండో సెమీస్‌లో విజయం సాధించిన జట్టుతో ఆదివారం భారత్ ఫైనల్ మ్యాచ్‌లో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు దుబాయ్ ఆతిథ్యం ఇవ్వనుంది.
కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన మూడేళ్లలోనే రోహిత్ శర్మ నాలుగు ఐసీసీ టోర్నీల్లో భారత్‌ను ఫైనల్‌కు తీసుకువెళ్లడం విశేషం.
ధోని కెప్టెన్సీలో మూడే..
టీమ్ఇండియాకు మూడు ఐసీసీ టైటిళ్లు అందించాడు దిగ్గజ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని. అతడి నాయకత్వంలో 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్ నిలిచింది. 2015 వన్డే ప్రపంచకప్‌లో భారత్ ఓడిపోయింది. ధోని హయాంలో ప్రపంచటెస్టు ఛాంపియన్ షిప్ ప్రారంభం కాలేదు.
ఇక విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో భారత్ డబ్ల్యూటీసీ 2019-21 ఫైనల్‌తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీ 2017 ఫైనల్‌లో మాత్రమే భారత్ ఆడింది. వన్డే ప్రపంచకప్ 2019తో పాటు టీ20 ప్రపంచకప్ 2016లో కోహ్లీ నాయకత్వంలో భారత్ బరిలోకి దిగినా సెమీస్‌లోనే ఇంటి ముఖం పట్టింది.
గేల్ సిక్సర్ల రికార్డు బ్రేక్..
సెమీస్‌లో ఆసీస్‌తో మ్యాచ్‌లో సిక్స్ కొట్టిన అనంతరం రోహిత్ శర్మ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఐసీసీ వన్డే టోర్నీల్లో (వన్డే ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ)లలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో క్రిస్‌గేల్ రికార్డు బద్దలు కొట్టాడు. గేల్ 64 సిక్స్‌లు కొట్టగా రోహిత్ శర్మ 65 సిక్సర్లు బాదాడు.
ఐసీసీ వన్డే ఈవెంట్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్లు వీరే..
రోహిత్ శర్మ(భారత్) – 42 ఇన్నింగ్స్‌ల్లో 65 సిక్సర్లు
క్రిస్ గేల్ (వెస్టిండీస్) – 51 ఇన్నింగ్స్‌ల్లో 64 సిక్సర్లు
గ్లెన్ మాక్స్‌వెల్ (ఆస్ట్రేలియా) – 30 ఇన్నింగ్స్‌ల్లో 49 సిక్సర్లు
డేవిడ్ మిల్లర్ (దక్షిణాఫ్రికా) – 30 ఇన్నింగ్స్‌ల్లో 45 సిక్సర్లు
సౌరవ్ గంగూలీ (భారత్) – 32 ఇన్నింగ్స్‌ల్లో 42 సిక్సర్లు
డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా) – 33 ఇన్నింగ్స్‌ల్లో 42 సిక్సర్లు