Team India enter into U19 Womens Asia Cup final
మహిళల అండర్-19 ఆసియాకప్ టోర్నీలో భారత జట్టు అదరగొడుతోంది. వరుస విజయాలతో ఫైనల్‌కు చేరుకుంది. శుక్రవారం శ్రీలంకతో జరిగిన సెమీఫైనల్ మ్యాచులో భారత్ 4 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది.
ఈ మ్యాచ్‌లో శ్రీలంక జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది. లంక బ్యాటర్లలో మనుడి నానయక్కర (33; 30 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లు), సుముడు నిసంసాల (21) మాత్రమే రెండు అంకెల స్కోరు చేశారు.
సజనా కవిండి (9), రష్మిక (8), హిరుణి హన్సిక (2), దహమి (5), లిమాన్స (1) సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. భారత బౌలర్లలో ఆయూషి శుక్లా నాలుగు వికెట్లతో రాణించింది. పరుణికా సిసోడియా రెండు వికెట్లు తీయగా షబ్నమ్ షకీల్, దృతి కేసరి ఒక్కొ వికెట్ పడగొట్టారు.
ఈ లక్ష్యాన్ని భారత్ 14.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. తెలుగు అమ్మాయి గొంగిడి త్రిష (32; 24 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు), కమలిని (28; 26 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్)లు రాణించారు. లంక బౌలర్లలో చామోడి ప్రభోద మూడు, శశినీ గిమ్హాని రెండు వికెట్లు తీశారు.
India U19 Women register a 4-wicket win in their Super four clash against Sri Lanka U19 Women 👏👏
Aayushi Shukla becomes the Player of the match for her match-winning four-wicket haul 🙌
Scorecard – https://t.co/ZQq5LIOiXk#TeamIndia | #ACCWomensU19AsiaCup | #ACC pic.twitter.com/6BQF71v26i
— BCCI Women (@BCCIWomen) December 20, 2024