మళ్లీ మారిందిగా: కొత్త జెర్సీలో టీమిండియా

మళ్లీ మారిందిగా: కొత్త జెర్సీలో టీమిండియా

Updated On : September 15, 2019 / 5:58 AM IST

కొద్ది నెలల క్రితం ముగిసిన వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో టీమిండియా జెర్సీ రంగు మార్చుకుని బరిలోకి దిగింది. ప్రత్యేకించి ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో ఆరెంజ్ రంగు జెర్సీలో కనిపించింది. అది ఆ ఒక్క టోర్నమెంట్‌కే పరిమితమైనా ఇప్పుడు మరో జెర్సీతో కనిపిస్తుంది. ఇందులో మార్పు ఏమంటే.. వెస్టిండీస్ పర్యటన వరకూ ఒప్పొ జెర్సీతో బరిలోకి దిగిన టీమిండియా ఈ సారి వేరే స్పాన్సర్ లోగోతో ఆడనుంది. 

ఒప్పంద కాలాన్ని మధ్యలోనే విరమించుకున్న ఒప్పొ ఆ అవకాశాన్ని బిజూకు అప్పగించింది. జులైలోనే ఇది ప్రకటించినా.. సెప్టెంబర్ నుంచి అమలులోకి రానున్నట్లు తెలిపారు. ఇదే స్పాన్సర్‌తో టీమిండియా ఉన్న ఒప్పందాన్ని 2022వరకూ కొనసాగించనుంది. 

వెస్టిండీస్ పర్యటన ఆసాంతం ఒక్క సిరీస్‌లోనూ ఓటమికి గురికాకుండా ప్రతి మ్యాచ్‌ను విజయవంతంగా ముగించింది టీమిండియా. దక్షిణాఫ్రికా మాత్రం ఇందుకు పూర్తిగా వ్యతిరేకం. సొంతగడ్డపై తిరుగులేని భారత్‌ సఫారీలను సునాయాసంగా జయించగలదు. వరల్డ్ కప్ టోర్నీ తర్వాత ఇరు జట్లు ఆడుతున్న తొలి సిరీస్ ఇదే. ఇందులో భాగంగానే ధర్మశాల వేదికగా తొలి టీ20 మ్యాచ్‌లోనూ ఇరు జట్లు తలపడనున్నాయి.