Bcci Tour
Team India: రాబోయే దక్షిణాఫ్రికా పర్యటనకు సంబంధించి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా.. క్రికెట్ సౌతాఫ్రికాలు సంయుక్తంగా ఒక ఒప్పందానికి వచ్చాయి. ఈ మేరకు డిసెంబర్ 16నే దక్షిణాఫ్రికా పర్యటనకు బయల్దేరాలని నిర్ణయించారు. మూడు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ముందుగానే ముంబైలోని బయో బబుల్ లోకి టీమిండియా ప్లేయర్లు ఎంటర్ అవుతారు.
కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా.. కివీస్ జట్టును టెస్టు ఫార్మాట్ లో ఓడించి మరోసమరం కోసం బయల్దేరింది. డిసెంబర్ 26న మొదటి టెస్టు మ్యాచ్ జరగనుండగా, రెండో మ్యాచ్ జనవరి 3నుంచి జనవరి 7వరకూ వాండరర్స్ స్టేడియంలో, మూడో మ్యాచ్ జనవరి 11నుంచి జనవరి 15వరకూ జరగనున్నాయి. ఆ తర్వాత జనవరి 19, జనవరి 21, జనవరి 23న మూడు వన్డేలు జరగుతాయి.
టీ20 ఫార్మాట్‌కే కాదు.. వన్డే ఫార్మాట్ కు కూడా రోహిత్ నే కెప్టెన్ గా కన్ఫామ్ చేసింది బీసీసీఐ సెలక్షన్ కమిటీ. దీనిపై మాజీ కెప్టెన్ గంగూలీ కూడా వివరణ ఇచ్చాడు. రెండు వైట్ బాల్ ఫార్మాట్లకు ఇద్దరు వైట్ బాల్ కెప్టెన్లు ఎందుకని ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే కోహ్లీని వన్డే ఫార్మాట్ నుంచి తప్పించారంటూ సోషల్ మీడియాలో ఓ ప్రచారం జరుగుతుంది. దానికి తగ్గట్లుగానే కొందరు మాజీల నుంచి విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి.
………………………………….: సామ్ ఓ కొడతావా పాటకి భారీ రెస్పాన్స్!
దక్షిణాఫ్రికా సిరీస్ కోసం భారత టెస్టు బృందం: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, ఛెతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే, శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్) , R అశ్విన్, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, Mohd. షమీ, ఉమేష్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్, ఎండీ సిరాజ్.
స్టాండ్‌బై ప్లేయర్స్: నవదీప్ సైనీ, సౌరభ్ కుమార్, దీపక్ చాహర్, అర్జన్ నాగ్వాస్వాల్లా.
…………………………………….: బెయిల్ కావాలంటూ సంవత్సరంలోనే 11సార్లు పిటిషన్