Delhi Court: బెయిల్ కావాలంటూ సంవత్సరంలోనే 11సార్లు పిటిషన్

సంవత్సర కాలంలోనే బెయిల్ కావాలంటూ 11సార్లు పెట్టిన పిటిషన్ పై ఢిల్లీ కోర్టు సీరియస్ అయింది. తిరస్కరించిన పిటిషన్‌ను మళ్లీ దాఖలు చేస్తూ కోర్టు విలువైన సమయాన్ని వృథా చేసినట్లు పేర్కొం

Delhi Court: బెయిల్ కావాలంటూ సంవత్సరంలోనే 11సార్లు పిటిషన్

Judgement

Updated On : December 12, 2021 / 4:35 PM IST

Delhi Court: సంవత్సర కాలంలోనే బెయిల్ కావాలంటూ 11సార్లు పెట్టిన పిటిషన్ పై ఢిల్లీ కోర్టు సీరియస్ అయింది. తిరస్కరించిన పిటిషన్‌ను మళ్లీ దాఖలు చేస్తూ కోర్టు విలువైన సమయాన్ని వృథా చేసినట్లు పేర్కొంది. దీనిపై అడిషనల్ సెషన్స్ నిర్వహించిన జడ్జి రవీందర్ బేడీ రూ.25వేలు జరిమానా విధిస్తున్నట్లు ఆదేశాలు ఇచ్చారు.

పరిస్థితుల్లోనూ మార్పుల్లేకుండానే.. 11సార్లు బెయిల్ గురించి అప్లికేషన్ పెట్టాడు ఆ వ్యక్తి. నిందితుడు పెట్టిన పదో బెయిల్ పిటిషన్ ను 2021 నవంబర్ 29న కొట్టేశారు. 2020 నవంబర్ 27నుంచి నిందితుడ్ని జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నాడు.

“వాస్తవ పరిస్థితిలో లేదా చట్టంలో ఎటువంటి గణనీయమైన మార్పు లేనప్పుడు దరఖాస్తుదారుడు చేసుకున్న పిటిషన్లు వరుస బెయిల్ దరఖాస్తుగా పరిగణించబడవు” అని న్యాయమూర్తి చెప్పారు.

………………………….. : సైనిక లాంఛనాలతో సాయితేజ్ అంత్యక్రియలు పూర్తి