Saitej’s Funeral : సైనిక లాంఛనాలతో సాయితేజ్ అంత్యక్రియలు పూర్తి

ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో అమరుడైన పారా కమాండో సాయితేజ్ అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. చిత్తూరు జిల్లాలోని స్వగ్రామం ఎగువరేగడలో ఆదివారం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.

Saitej’s Funeral : సైనిక లాంఛనాలతో సాయితేజ్ అంత్యక్రియలు పూర్తి

Saiteja

Para Commando Saitej’s funeral : ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో అమరుడైన పారా కమాండో సాయితేజ్ అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. చిత్తూరు జిల్లాలోని స్వగ్రామం ఎగువరేగడలో ఆదివారం అంత్యక్రియలు ముగిశాయి. సైనిక లాంఛనాలతో సాయితేజ్ అంత్యక్రియలు నిర్వహించారు. సాయితేజ్ అంత్యక్రియలకు భారీగా ప్రజలు తరలివచ్చారు. అంతకముందు సాయితేజ్ కు నివాళులర్పించేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. సాయితేజ్ భౌతికకాయాన్ని చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వీరుడికి గ్రామస్థులు ఘనంగా నివాళులర్పించారు. సాయితేజ్..అమర్ రహే నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగింది.

అంతకముందు డీఎన్ఏ టెస్టుల ఆధారంగా.. సాయితేజ మృతదేహాన్ని ఆర్మీ అధికారులు గుర్తించారు. ఆస్పత్రిలో ఆర్మీ అధికారులు శ్రద్ధాంజలి ఘటించిన తర్వాత.. ఢిల్లీ నుంచి సాయితేజ మృతదేహాన్ని కోయంబత్తూరు ఎయిర్‌బేస్‌కు తరలించారు. అక్కడి నుంచి బెంగళూరుకు ఎయిర్ లిఫ్ట్ చేసి.. ఆర్మీ బేస్ ఆస్పత్రిలో ఉంచారు. అక్కడ.. సైనికాధికారులు శ్రధ్ధాంజలి ఘటించి.. సెల్యూట్ చేశారు. సాయితేజ్ భౌతికకాయాన్ని బెంగళూరులోని ఎలహంక ఆర్మీ బేస్‌ నుంచి.. రోడ్డు మార్గంలో చిత్తూరు జిల్లాకు తరలించారు. అక్కడి నుంచి మధ్యాహ్నం ఎగువరేగడ గ్రామానికి తరలించారు.

Omicron In India : భారత్ లో 36కు చేరిన ఒమిక్రాన్ కేసులు.. కొత్తగా మరో మూడు గుర్తింపు

చిత్తూరు జిల్లా సరిహద్దు చీకలబైలు చెక్ పోస్టు…వలసపల్లి మీదుగా..ఎగువరేగడకు రోడ్డు మార్గంలో తరలించారు. సుమారు 30 కిలో మీటర్ల దూరం ఉన్న రోడ్డుకిరువైపులా ప్రజలు బారులు తీరి..నివాళులర్పిస్తున్నారు. అంబులెన్స్ పై పువ్వులు చల్లుతూ లాస్ట్ సెల్యూట్ సమర్పించారు. జై జవాన్…అమర్ రహే నినాదాలతో మారుమోగింది.

తమిళనాడు నీలగిరి జిల్లా కూనూర్‌ వద్ద భారత వాయుసేనకు సంబంధించిన ఎంఐ17వీ5 (Mi-17V5) హెలికాప్టర్‌ కూలిపోయిన విషయం తెలిసిందే. హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన 13మందిలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన సాయితేజ్‌ కూడా ఉన్నారు. చిత్తూరు జిల్లా కురుబలకోట మండలం ఎగువరేగడ గ్రామానికి చెందిన సాయితేజ్‌ ఈ ప్రమాదంలో మృతి చెందారు.

MLA Mumtaz Khan : ఎంఐఎం ఎమ్మెల్యే దౌర్జన్యం…నమస్తే పెట్టలేదని యువకుడిపై దాడి

సిద్ధారెడ్డి పల్లికి చెందిన శ్యామలతో సాయితేజ్​కు 2015లో వివాహం అయింది. వీరికి కుమారుడు మోక్షజ్ఞ(4), కూతురు దర్శిని(2) ఉన్నారు. వీరి కుటుంబం మదనపల్లె ఎస్​బీఐ కాలనీలో ఏడాది కాలంగా నివాసం ఉంటోంది. 2013లో సాయితేజ్ ఆర్మీలో జవానుగా చేరారు. ఏడాది తర్వాత పారా కమెండో శిక్షణ పూర్తి చేసుకున్నాడు.

స్పెషల్ ఫోర్సెస్​ 11 పారా విభాగంలో లాన్స్ నాయక్ హోదాలో విధులు నిర్వర్తిస్తున్నారు. బెంగళూరులో సైనికులకు శిక్షకుడిగా పని చేసిన సాయితేజ్.. ప్రస్తుతం బిపిన్ రావత్ వ్యక్తిగత భద్రతలో విధులు నిర్వర్తిస్తున్నారు.