Sanju Samson : తుది జ‌ట్టులో సంజూశాంస‌న్‌కు నో ప్లేస్‌..? ప్రాక్టీస్ సెష‌న్‌లో దూరంగా చెట్టు కింద కూర్చున శాంస‌న్!

సోమ‌వారం టీమ్ఇండియా ప్రాక్టీస్ సెష‌న్ త‌రువాత తుది జ‌ట్టులో సంజూ శాంస‌న్‌(Sanju Samson)కు చోటు క‌ష్ట‌మేన‌న్న వార్త‌లు వ‌స్తున్నాయి.

Team India Practice Reveals Surprising Hints Sanju Samson To Face Asia Cup 2025 Snub

Sanju Samson : ఆసియాక‌ప్ 2025 కోసం ఎంపిక చేసిన జ‌ట్టులో సంజూశాంస‌న్‌కు చోటు ద‌క్కింది. అయితే.. వైస్ కెప్టెన్‌గా శుభ్‌మ‌న్ గిల్ ఎంపిక కావ‌డంతో తుది జ‌ట్టులో సంజూ శాంస‌న్ ఉంటాడా? ఉండ‌డా? అన్న ప్ర‌శ్న అంద‌రి మ‌దిలో మెదులుతోంది. ఓ ఓపెన‌ర్‌గా ఎడ‌మ‌చేతి వాటం ఆట‌గాడు అభిషేక్ శ‌ర్మ ఆడ‌తాడ‌ని, మ‌రో ఓపెనింగ్ స్థానంలో సంజూ లేదా గిల్‌ల‌లో ఒక‌రు ఆడ‌తార‌ని ఆసియాక‌ప్‌కు జ‌ట్టును ఎంపిక చేసిన సంద‌ర్భంలో చీఫ్ సెల‌క్ట‌ర్‌ అజిత్ అగార్క‌ర్ చెప్పాడు. దీనిపై జ‌ట్టు దుబాయ్ చేరుకున్న త‌రువాత మేనేజ్‌మెంట్‌, కెప్టెన్ నిర్ణ‌యం తీసుకుంటాడ‌ని అన్నారు.

నేటి నుంచి ఆసియాక‌ప్ 2025 ఆరంభం కానుంది. టీమ్ఇండియా త‌న తొలి మ్యాచ్‌ను ఆతిథ్య యూఏఈతో బుధ‌వారం ఆడ‌నుంది. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే దుబాయ్ చేరుకున్న భార‌త జ‌ట్టు ఆట‌గాళ్లు ఈ మెగాటోర్నీ కోసం నెట్స్‌లో తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు. ఇక సోమ‌వారం భార‌త జ‌ట్టు ప్రాక్టీస్‌ను చూసిన త‌రువాత సంజూ శాంస‌న్‌(Sanju Samson)కు తుది జ‌ట్టులో చోటు ద‌క్క‌డం క‌ష్ట‌మేని క్రికెట్ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Morne Morkel : ఆసియాక‌ప్‌లో భార‌త బౌలింగ్ కాంబినేష‌న్ పై మోర్కెల్ కీల‌క వ్యాఖ్య‌లు.. స్పిన్న‌ర్ల‌కు చోటు క‌ష్ట‌మే..!

సోమవారం సాయంత్రం ఐసీసీ క్రికెట్ అకాడమీలో భార‌త ఆట‌గాళ్లు ప్రాక్టీస్ చేశారు. ఆ స‌మ‌యంలో ఆస‌క్తిక‌ర వాతావ‌ర‌ణం క‌నిపించింది. అంద‌రికంటే ముందుగా ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్‌తో క‌లిసి సంజూ శాంస‌న్ వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ చేశాడు. అత‌డు కుడివైపున డైవ్ చేస్తూ క్యాచ్ తీసుకుని ప్ర‌శంస‌లు కూడా అందుకున్నాడు. ఆ స‌మ‌యంలో మిగిలిన ఆట‌గాళ్లు ఒక్కొక్క‌రుగా మైదానానికి చేరుకున్నారు.

శాంస‌న్‌తో మూడు నిమిషాలు మాట్లాడిన గంభీర్‌..

ఆ త‌రువాత టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్ న‌డుచుకుంటూ సంజూ శాంస‌న్ వ‌ద్ద‌కు వ‌చ్చాడు. దాదాపు మూడు నిమిషాల పాటు అత‌డితో మాట్లాడాడు. శాంస‌న్ వికెట్ కీపింగ్ గురించి కాకుండా అత‌డి బ్యాటింగ్ గురించి గంభీర్ మాట్లాడిన‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి.

బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసిన జితేశ్‌..

మ‌రోవైపు జితేష్ శర్మ చాలా ఆత్మ‌విశ్వాసంతో క‌నిపించాడు. అత‌డు శివమ్ దూబే, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యాల‌తో క‌లిసి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఈ మిడిల్ ఆర్డ‌ర్ ఆట‌గాళ్లు బ్యాటింగ్ చేస్తున్న స‌మ‌యంలో శాంస‌న్ త‌న కిట్‌తో నెట్స్ వ‌ద్ద‌కు వ‌చ్చాడు. కాసేప‌టి త‌రువాత అత‌డు నిశ్శ‌బ్దంగా అత‌డి నుంచి వెళ్లిపోయి డ్రెస్సింగ్ రూమ్ కు స‌మీపంలో ఉన్న ఓ తాటి చెట్టు కింద కూర్చుకున్నాడు.

Mohammed Siraj : ఒకే ఒక మ్యాచ్.. అయితేనేం.. ప్ర‌తిష్టాత్మ‌క అవార్డు రేసులో టీమ్ఇండియా పేస‌ర్ సిరాజ్‌

దూబే, తిల‌క్‌, హార్దిక్, జితేశ్ బ్యాటింగ్ ప్రాక్టీస్ త‌రువాత కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్, వైస్ కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్‌, ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ లు సైతం బ్యాటింగ్ ప్రాక్టీస్ వేశారు. వీరంతా ఒక్క‌సారి కాదు.. వంతుల వారీగా రెండు మూడు సార్లు ప్రాక్టీస్ చేశారు. అయిన‌ప్ప‌టికి కూడా సంజూ శాంస‌న్‌ను ఎవ్వ‌రూ పిల‌వ‌లేదు.

చాలా సేప‌టి త‌రువాత శాంస‌న్ అక్క‌డి నుంచి లేచి నెట్స్ వ‌ద్ద‌కు వ‌చ్చాడు. అత‌డికి బ్యాటింగ్ చేసే ఛాన్స్ లేద‌ని తెలిసిన త‌రువాత ప‌క్క‌నే ఉన్న ఐస్ బాక్స్ పై కూర్చుకున్నాడు. ఆఖ‌రికి అంద‌రి ప్రాక్టీస్ పూర్తి అయిన త‌రువాత శాంస‌న్‌కు బ్యాటింగ్ ప్రాక్టీస్‌కు అవ‌కాశం వ‌చ్చింది. చివరికి నెట్ బౌలర్ అతనికి బౌలింగ్ చేశాడు. టీమ్ఇండియా న‌యా ఫినిష‌ర్ రింకూ సింగ్ సైతం ప్యాడ్స్ వేసుకోకుండానే క‌నిపించాడు. దీంతో అత‌డు తుది జ‌ట్టులో ఉండ‌క‌పోవ‌చ్చున‌నే సంకేతం ఇదేన‌ని అంటున్నారు.

బ్యాటింగ్ డెప్త్ పై గంభీర్ దృష్టి..!

గంభీర్ దృష్టి అంతా బ్యాటింగ్ డెప్త్ పైనే పెట్టిన‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో అత‌డు బ్యాటింగ్ ఆల్‌రౌండ‌ర్ల పైనే ప్ర‌త్యేక ఫోక‌స్ చేశాడు. ఫినిష‌ర్‌గా జితేశ్ శ‌ర్మ ను తీసుకునే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.