IND vs ENG : గెలుపు జోష్‌లో ఉన్న భారత్‌కు షాక్..
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భారత్ అదరగొడుతోంది. అయితే.. గాయంతో టీమ్ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ సిరీస్‌లో మిగిలిన మ్యాచులకు దూరం అయ్యాడు.

Team India star All rounder Nitish Kumar Reddy ruled out remaining part of T20I series against England
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచుల్లోనూ గెలిచి భారత్ మంచి జోష్‌లో ఉంది. శనివారం చెన్నై వేదికగా ఉత్కంఠభరితంగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమ్ఇండియా రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో యువ ఆటగాడు, తెలుగు కుర్రాడు తిలక్ వర్మ 55 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 72 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే.. గెలుపు జోష్‌లో ఉన్న భారత్‌కు గట్టి షాక్ తగిలింది.
టీమ్ఇండియా నయా ఆల్‌రౌండర్, తెలుగు కుర్రాడు నితీష్‌కుమార్ రెడ్డి ఈ సిరీస్ మొత్తానికి దూరం అయ్యాడు. కోల్‌కతా వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచులో నితీష్ ఆడాడు. అయితే.. అటు బ్యాటింగ్‌లో, ఇటు బౌలింగ్‌లో అతడికి అవకాశం రాలేదు. ఇక చెన్నై వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచులో అతడు ఆడలేదు. అతడు ఎందుకు ఆడలేదో గల కారణాలను మ్యాచ్‌కు ముందు బీసీసీఐ వెల్లడించింది. ప్రాక్టీస్ సెషన్‌లో నితీష్ గాయపడినట్లు పేర్కొంది. అతడి అయిన గాయం తీవ్రమైనది కావడంతో రెండో టీ20తో పాటు మిగిలిన మ్యాచ్‌ల నుంచి అతడు తప్పుకున్నట్లు వెల్లడించింది.
Siraj : సింగర్‌తో సిరాజ్ డేటింగ్? ఆమె ఎవరో తెలుసా? ఆమె బ్యాగ్రౌండ్ ఏంటంటే..?
🚨 NEWS 🚨
Medical Updates: Nitish Kumar Reddy & Rinku Singh
Details 🔽 #TeamIndia | #INDvENG | @IDFCFIRSTBankhttps://t.co/hu3OdOG16J
— BCCI (@BCCI) January 25, 2025
మరో ఆటగాడు రింకూ సింగ్ వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు తెలిపింది. తొలి టీ20 మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో వెన్నునొప్పి బారిన పడినట్లు చెప్పింది. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నట్లు వెల్లడించింది. బీసీసీఐ వైద్యుల బృందం అతడిని నిరంతం పర్యవేక్షిస్తున్నట్లుగా తెలిపింది. దీంతో అతడు రెండు, మూడో టీ20 మ్యాచులకు అందుబాటులో ఉండడని పేర్కొంది. ఈ క్రమంలో శివమ్ దూబె, రమన్‌దీప్ సింగ్‌లను ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన స్క్వాడ్‌లో చేర్చుతున్నట్లు ప్రకటించింది.
నితీష్ గాయంపై సన్‌రైజర్స్ రియాక్షన్..
నితీష్ రెడ్డి గాయంపై సన్‌రైజర్స్ యాజమాన్యం స్పందించింది. అతడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. ‘నితీష్.. నువ్వు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాం. మరింత బలంగా తిరిగి రా’ అని ట్వీట్ చేసింది. ఐపీఎల్ 2025 సీజన్‌లో నితీష్ కుమార్ రెడ్డి సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఒకవేళ అతడి గాయం తీవ్రమైనది అయి.. ఐపీఎల్ 2025 నుంచి తప్పుకుంటే అది ఎస్ఆర్‌హెచ్‌కు గట్టి ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు. ఐపీఎల్ 2024 సీజన్‌లో ఎస్ఆర్‌హెచ్ ఫైనల్ చేరడంతో నితీష్ రెడ్డి కీలక పాత్ర పోషించాడు.
Wishing you a speedy recovery, Nitish!
Come back stronger. #PlayWithFire
— SunRisers Hyderabad (@SunRisers) January 25, 2025