IND vs ZIM 3rd T20 : గిల్‌, రుతురాజ్ మెరుపులు.. సుంద‌ర్ తీన్‌మార్‌.. జింబాబ్వే పై భార‌త్ విజ‌యం..

శుభ్‌మ‌న్ గిల్ సార‌థ్యంలోని భార‌త యువ జ‌ట్టు అద‌ర‌గొట్టింది.

Pic credit : BCCI

IND vs ZIM : శుభ్‌మ‌న్ గిల్ సార‌థ్యంలోని భార‌త యువ జ‌ట్టు అద‌ర‌గొట్టింది. కీల‌కమైన మూడో టీ20 మ్యాచ్‌లో జింబాబ్వే పై 23 ప‌రుగుల తేడాతో విజ‌యాన్ని అందుకుంది. త‌ద్వారా 5 మ్యాచుల టీ20 సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి భార‌త్ దూసుకువెళ్లింది.

183 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన జింబాబ్వే జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 159 ప‌రుగుల‌కే ప‌రిమితమైంది. జింబాబ్వే బ్యాట‌ర్ల‌లో డియోన్ మైయర్స్ (65 నాటౌట్; 49 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌) ఒక్క‌డే ఒంట‌రి పోరాటం చేశాడు. మిగిలిన వారిలో క్లైవ్ మదాండే (37) ఫ‌ర్వాలేద‌నిపించ‌గా, తడివానాషే మారుమణి (13), సికింద‌ర్ ర‌జా (15), వెల్లింగ్టన్ మసకద్జా (18 నాటౌట్‌) లు మాత్ర‌మే రెండు అంకెల స్కోరు చేశారు.

భారీ ల‌క్ష్య ఛేద‌న‌లో బ‌రిలోకి దిగిన జింబాబ్వే జ‌ట్టుకు ఆదిలోనే వ‌రుస షాక్‌లు త‌గిలాయి. భార‌త బౌల‌ర్ల ధాటికి 39 ప‌రుగుల‌కే 5 వికెట్లు కోల్పోయి పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డింది. ఈ ద‌శ‌లో డియోన్ మైయ‌ర్స్‌, క్లైవ్ మ‌దాండేలు జ‌ట్టును ఆదుకున్నారు. వీరిద్ద‌రు భార‌త బౌల‌ర్ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొన్నారు. ఓ వైపు మ‌దాండే చ‌క్క‌ని స‌హ‌కారం అందించ‌గా మ‌రోవైపు మైయ‌ర్స్ భార‌త బౌల‌ర్ల‌పై ఎదురుదాటికి దిగాడు. వీలుచిక్కిన‌ప్పుడ‌ల్లా బౌండ‌రీలు బాదుతూ స్కోరు బోర్డును ముందుకు తీసుకువెళ్లాడు.

Gautam Gambhir : ద‌టీజ్ గంభీర్‌.. వ‌చ్చాడు.. వాళ్లే కావాల‌ని డిమాండ్ చేస్తున్నాడు..!

వీరిద్ద‌రి జోడి ప్ర‌మాద‌క‌రంగా మారింది. అయితే.. మ‌దాండే ను ఔట్ చేయ‌డం ద్వారా వాషింగ్ట‌న్ సుంద‌ర్ ఈ జోడీని విడ‌గొట్టాడు. మైయ‌ర్స్‌-మ‌దాండే జోడీ ఆరో వికెట్ కు 77 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. ఆ త‌రువాత మైయ‌ర్స్ అర్థ‌శ‌త‌కాన్ని పూర్తి చేసుకున్నాడు. అప్ప‌టికే సాధించాల్సిన ర‌న్‌రేట్ పెరిగిపోవ‌డంతో అత‌డి పోరాటం ఓట‌మి అంత‌రాన్ని త‌గ్గించడానికే స‌రిపోయింది. భార‌త బౌల‌ర్ల‌లో వాషింగ్ట‌న్ సుంద‌ర్ మూడు, ఆవేశ్ ఖాన్ రెండు, ఖ‌లీల్ అహ్మ‌ద్ ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.

దంచికొట్టిన భార‌త బ్యాట‌ర్లు..
అంత‌క‌ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భార‌త్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 182 ప‌రుగులు చేసింది. భార‌త బ్యాట‌ర్ల‌లో కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ (66; 49 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీ బాద‌గా, రుతురాజ్ గైక్వాడ్ (49; 28 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) తృటిలో అర్థ‌శ‌త‌కాన్ని కోల్పోయాడు. య‌శ‌స్వి జైస్వాల్ (36; 27 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) రాణించాడు. జింబాబ్వే బౌల‌ర్ల‌లో ముజారబానీ, సికింద‌ర్ ర‌జాలు చెరో రెండు వికెట్లు తీశారు.

PCB : ప్ర‌పంచ‌క‌ప్‌లో దారుణ ప‌రాభ‌వం.. పీసీబీ మొద‌లెట్టింది.. ఇద్ద‌రి పై వేటు.. లైన్‌లో..

ట్రెండింగ్ వార్తలు