IND vs AUS 1st Test Match: టీమిండియా స్పిన్ ధాటికి చిత్తైన ఆసీస్.. తొలి టెస్టులో భారత్ ఘన విజయం
భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య నాగ్‌పుర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో విజయం సాధించింది.

IND vs AUS Test Match
IND vs AUS 1st Test Match: ప్రతిష్టాత్మక బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా మధ్య నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి టెస్ట్ మ్యాచ్ నాగ్‌పూర్ వేదికగా జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా బౌలింగ్, బ్యాటింగ్ విభాగంలో పూర్తిస్థాయిలో ఆధిపత్యాన్ని ప్రదర్శించి ఆసీస్‌ను చిత్తు చేసింది. ఫలితంగా ఆసీస్‌పై భారత్ ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మూడు రోజుల్లోనే టెస్ట్ మ్యాచ్ ముగియడం, ఆసీస్ జట్టుపై భారత్ జట్టు ఘన విజయం సాధించడం గమనార్హం.
మూడో రోజు టీమిండియా తొలి ఇన్నింగ్స్ 321/7 ఓవర్‌నైట్ స్కోర్‌తో బ్యాటింగ్ ప్రారంభించింది. అయితే, ఆదిలోనే టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. మంచి ఫామ్‌లో ఉన్న రవీంద్ర జడేజా(70) మార్ఫీ ఔట్ చేశాడు. ఆ తరువాత క్రీజ్ లోకి వచ్చిన షమీ (37) ఔట్ అయ్యాడు. కొద్ది సేపటికే అక్షర్ పటేల్ (84) ఔట్ కావటంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్ 400 పరుగు సాధించి.. ఆస్ట్రేలియాపై 223 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఉస్మాన్ ఖావాజా (5) తక్కువ స్కోర్‌కే పెవిలిన్ బాట పట్టారు. అశ్విన్ బౌలింగ్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
IND Vs AUS 1st Test : నాగ్‌పూర్ టెస్ట్.. ముగిసిన తొలి రోజు ఆట, భారత్‌దే పైచేయి
అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్, చివర్లో షమీ అద్భుత బౌలింగ్ తో ఆసీస్ బ్యాటర్లు ఏమాత్రం క్రీజ్‌లో నిలవలేక పోయారు. స్మిత్ ఒక్కడే 25 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మిగిలిన ఆసీస్ బ్యాట్స్‌మెన్ ఎవరూ ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేక పోయారు. అశ్విన్ అద్భుత బౌలింగ్‌తో ఐదు వికెట్లు తీసుకోగా, జడేజా రెండు, షమీ రెండు వికెట్లు, అక్షర పటేల్ ఒక వికెట్ తీశారు. దీంతో భారత్ రెండో ఇన్నింగ్స్ ఆడకుండానే ఇన్సింగ్స్ 132 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ – 177
భారత్ తొలి ఇన్నింగ్స్ – 400
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ – 91