IND vs SA T20 Match : సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లో ఉత్తమ ఫీల్డర్ పతకాన్నిఅందుకున్న హైదరాబాదీ క్రికెటర్..

టీ20 సిరీస్ లో భాగంగా గురువారం జరిగిన చివరి మ్యాచ్ అనంతరం టీమిండియా ఫీల్డింగ్ కోచ్ దిలీప్ ఉత్తమ ఫీల్డర్ ఎంపిక సంప్రదాయాన్ని కొనసాగించారు.

Teamindia Impact Fielder : ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగిన టీ20 సిరీస్ డ్రాగా ముగిసింది. మూడు మ్యాచ్ లలో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దుకాగా.. రెండు మ్యాచ్ లలో 1-1తో ఇరు జట్లు సమంగా నిలిచాయి. గురువారం రాత్రి జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో దక్షిణాఫ్రికా జట్టుపై 106 పరుగుల భారీ తేడాతో టీమిండియా విజయం సాధించింది. కాగా, వరల్డ్ కప్ 2023లో మాదిరిగా మ్యాచ్ తరువాత ఉత్తమ ఫీల్డర్ ఎంపిక సంప్రదాయాన్ని భారత్ జట్టు యాజమాన్యం కొనసాగిస్తోంది. వరల్డ్ కప్ లో ప్రతీ మ్యాచ్ తరువాత ఉత్తమ ఫీల్డర్ ను ఎంపికచేసి అవార్డును అందజేశారు. ప్రస్తుతం టీ20 సిరీస్ మొత్తానికి ఉత్తమ ఫీల్డర్ అవార్డును అందజేశారు.

Also Read : Virat kohli : టెస్ట్ సిరీస్‌కోసం సౌతాఫ్రికాకు బయలుదేరిన విరాట్ కోహ్లీ.. వీడియో వైరల్

టీ20 సిరీస్ లో చివరి మ్యాచ్ అనంతరం టీమిండియా ఫీల్డింగ్ కోచ్ దిలీప్ ఉత్తమ ఫీల్డర్ ఎంపిక సంప్రదాయాన్ని కొనసాగించారు. ఇకనుంచి ‘ఉత్తమ ఫీల్డర్’ అవార్డును సిరీస్ మొత్తానికి ఇవ్వబడుతుందని తెలిపారు. ఈ క్రమంలో సఫారీ జట్టుతో టీ20 సిరీస్ లో ఉత్తమ ఫీల్డర్ అవార్డుకు టీమిండియా ఫాస్ట్ బౌలర్, హైదరాబాదీ క్రికెటర్ సిరాజుద్దీన్ ను ఎంపిక చేశారు. సిరాజ్ కు పతకాన్ని అందజేసిన అనంతరం దిలీప్ మాట్లాడుతూ.. ఇక నుంచి మ్యాచ్ మ్యాచ్ కు కాకుండా సిరీస్ మొత్తానికి ఉత్తమ ఫీల్డర్ అవార్డును అందజేస్తాం. ప్రపంచ కప్ టోర్నీ నుంచి సిరాజ్ అద్భుత బౌలింగ్ చేయడంతో పాటు తరచూ డ్రైవ్ చేసి బంతిని వికెట్లకు గిరాటేస్తున్నాడు. అంతేకాక, బౌండరీ లైన్ వద్ద మెరుగైన ఫీల్డింగ్ చేస్తున్నాడు. అందుకే అతనికి ఈ సిరీస్ కోసం ఉత్తమ ఫీల్డర్ అవార్డును అందజేశామని తెలిపారు.

Also Read : MS Dhoni Jersey : సచిన్ తరువాత ధోనీకి అరుదైన గౌరవం.. నంబర్ 7 జెర్సీపై బీసీసీఐ కీలక నిర్ణయం

ఉత్తమ ఫీల్డర్ అవార్డు అందుకున్న తరువాత సిరాజ్ మాట్లాడుతూ.. ప్రంపచ కప్ నుంచి ఈ పతకంకోసం ఎదురుచూస్తున్నాను.. ఇప్పుడు నాకు లభించింది. ఈ అవార్డు తనలో పట్టుదలను మరింత పెంచిందని చెప్పాడు.

 

 

 

ట్రెండింగ్ వార్తలు