×
Ad

CM Revanth Reddy : ఫుట్‌బాల్ దిగ్గ‌జ ఆట‌గాడు మెస్సీతో మ్యాచ్‌.. తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్న తెలంగాణ‌ సీఎం రేవంత్‌రెడ్డి

ఫుట్‌బాల్ దిగ్గ‌జ ఆట‌గాడు మెస్సీతో మ్యాచ్ కోసం తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రాక్టీస్ మొద‌లెట్టారు.

Telangana CM Revanth Reddy practices football to face Messi in Hyderabad on Dec 13

CM Revanth Reddy : ఫుట్‌బాల్ దిగ్గ‌జ ఆట‌గాడు, అర్జెంటీనా స్టార్ ఆట‌గాడు లియోనెల్ మెస్సీ భార‌త ప‌ర్య‌ట‌న‌కు రానున్నాడు. ఈ క్ర‌మంలో డిసెంబ‌ర్ 13న హైద‌రాబాద్‌కు విచ్చేయ‌నున్నాడు. అదే రోజు తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డితో మెస్సీ ప్ర‌త్యేకంగా భేటీ కానున్నాడు. ఆ త‌రువాత ఉప్ప‌ల్ మైదానంలో మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డి జ‌ట్ల మ‌ధ్య ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

ఈ మ్యాచ్ కోసం తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రాక్టీస్ మొద‌లెట్టారు. హైద‌రాబాద్‌లోని ఎంసీహెచ్ఆర్డీ గ్రౌండ్స్‌లో ఆట‌గాళ్ల‌తో క‌లిసి తీవ్రంగా సాధ‌న చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను, వీడియోల‌ను తెలంగాణ సీఎంవో సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకుంది.

IPL 2026 Auction : వంద కాదు.. ఐదు వంద‌లు కాదు.. వెయ్యి కాదు.. మినీ వేలం కోసం ఎంత మంది ద‌ర‌ఖాస్తు చేసుకున్నారో తెలిస్తే షాకే..

ఇక మెస్సీని ఆహ్వానించేందుకు, భేటీ అయ్యేందుకు, మ్యాచ్ ఆడేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్న‌ట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ‘క్రీడా స్ఫూర్తి.. తెలంగాణ కీర్తి.. ఈ నెల 13న ప్రపంచ ప్రముఖ ఫుట్ బాల్ క్రీడాకారుడు మెస్సీ తో ఫుట్ బాల్ క్రీడలో పాల్గొనేందుకు ప్రాక్టీస్ ప్రారంభించాను. “తెలంగాణ రైజింగ్ – 2047” విజన్ ను క్రీడా వేదిక నుండి మెస్సీ సహకారంతో ప్రపంచానికి మరింతగా పరిచయం చేయాలన్న వ్యూహాత్మక ఆలోచన నేపథ్యంతో క్రీడా మైదానంలోకి స్వయంగా దిగాను. ‘అంటూ ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోల‌ను సీఎం రేవంత్ రెడ్డి సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకున్నారు.

IND vs SA : రెండో వ‌న్డేకు ఆతిథ్యం ఇవ్వ‌నున్న రాయ్‌పుర్ స్టేడియం.. అప్పుడు బౌల‌ర్ల‌కు.. ఇప్పుడు ఎవ‌రికో?