IPL 2026 Auction : వంద కాదు.. ఐదు వందలు కాదు.. వెయ్యి కాదు.. మినీ వేలం కోసం ఎంత మంది దరఖాస్తు చేసుకున్నారో తెలిస్తే షాకే..
డిసెంబర్ 16న అబుదాబిలోని ఐపీఎల్ 2026 మినీ వేలం (IPL 2026 Auction) జరగనుంది.
IPL 2026 mini auction 1355 players registered
IPL 2026 Auction : ఐపీఎల్ 2026 సీజన్ కోసం సర్వం సిద్ధం అవుతోంది. ఈ సీజన్ కన్నా ముందు మినీ వేలాన్ని నిర్వహించనున్నారు. డిసెంబర్ 16న అబుదాబిలో మినీ వేలం జరగనుంది. ఈ వేలం కోసం వంద కాదు ఐదు వందలు కాదు వెయ్యి కాదు ఏకంగా 1355 మంది క్రికెటర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వీరిలో అంతర్జాతీయ క్రికెటర్లలో పాటు దేశవాళీ స్టార్ ఆటగాళ్లు, యువ ఆటగాళ్లు ఉన్నారు.
మయాంక్ అగర్వాల్, కేఎస్ భరత్, రాహుల్ చాహర్, రవి బిష్ణోయ్, ఆకాష్ దీప్, దీపక్ హుడా, వెంకటేష్ అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్, శివం మావి, నవదీప్ సైని, చేతన్ సకారియా, కుల్దీప్ సేన్, పృథ్వీ షా, రాహుల్ త్రిపాఠి, సందీప్ వారియర్, ఉమేష్ యాదవ్ వంటి భారత స్టార్ ఆటగాళ్లు వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
Team India : రోహిత్-కోహ్లీలతో క్షీణిస్తున్న గంభీర్ సంబంధాలు.. సయోధ్యకు బీసీసీఐ ప్రయత్నం!
ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా దేశాలకు చెందిన అంతర్జాతీయ క్రికెటర్లు సైతం ఈ జాబితాలో ఉన్నారు. ఆస్ట్రేలియా ఆటగాళ్లలో కామెరాన్ గ్రీన్, మాథ్యూ షార్ట్, స్టీవ్ స్మిత్ ఉన్నారు. పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న జోష్ ఇంగ్లిస్ కూడా వేలంలో తన పేరును నమోదు చేసుకున్నాడు. ఇంగ్లాండ్ నుంచి జేమీ స్మిత్, జానీ బెయిర్ స్టో, న్యూజిలాండ్ నుంచి రచిన్ రవీంద్ర, శ్రీలంక నుంచి వనిందు హసరంగా, మథీషా పతిరానా వంటి ఆటగాళ్లు ఈ జాబితాలో ఉన్నారు. అయితే.. ఇక్కడ ఆశ్చర్యకర విషయం ఏమిటంటే.. పంజాబ్ కింగ్స్ వదిలివేసినప్పటికి కూడా గ్లెన్ మాక్స్ వెల్ ఐపీఎల్ మినీ వేలానికి దరఖాస్తు చేసుకోలేదు
భారత్‌కు చెందిన ఇద్దరు ఆటగాళ్లు.. వెంకటేశ్ అయ్యర్, రవి బిష్ణోయ్‌లు కనీస ధర రూ.2 కోట్లతో రిజిస్టర్ చేసుకున్నారు. వీరితో పాటు 43 మంది విదేశీ ఆటగాళ్లు.. గ్రీన్, స్టీవ్ స్మిత్, జామీ స్మిత్, ముజీబ్ ఉర్ రెహమాన్, నవీన్ ఉల్ హక్, సీన్ అబాట్, ఆస్టన్ అగర్, కూపర్ కొన్నోలీ, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, ఇంగ్లిస్, ముస్తాఫిజుర్ రెహమాన్, గస్ అట్కిన్సన్, టామ్ బాంటన్, టామ్ కుర్రాన్, లియామ్ డాసన్, బెన్ డకెట్, డేనియల్ లారెన్స్, లియామ్ లివింగ్‌స్టోన్, డారిల్ మిచెల్, రవీంద్ర, మైఖేల్ బ్రేస్‌వెల్, జెరాల్డ్ కోట్జీ, లుంగి న్గిడి, అన్రిచ్ నోర్ట్జే, పతిరానా, మహీష్ తీక్షణ, హసరంగా తదితర ఆటగాళ్లు రూ.2 కోట్ల బేస్ ప్రైజ్‌తో నమోదు చేసుకున్నారు.
ఇక ఐపీఎల్‌లో తొమ్మిది సీజన్లు ఆడిన బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ రూ.కోటి కనీస ధరతో నమోదు చేసుకోగా.. న్యూజిలాండ్‌కు చెందిన కుడిచేతి వాటం స్పిన్నర్ ఆదిత్య అశోక్ రూ. 75 లక్షల బేస్ ధరతో ఉన్నారు.
77 ఖాళీలు మాత్రమే..
రిటైన్షన్ల జాబితా తరువాత 10 జట్లలో 77 ఖాళీలు ఉన్నాయి. ఇందులో 31 విదేశీ ఆటగాళ్లు కోసం కేటాయించబడినవి. అన్ని ఫ్రాంఛైజీల వద్ద మొత్తం 237.55 కోట్ల నగదు ఉంది. కోల్‌కతా నైట్ రైడర్స్ వద్ద అత్యధికంగా రూ. 64.30 ఉన్నాయి. ఆ తరువాత చెన్నై సూపర్ కింగ్స్ వద్ద రూ.43.40 కోట్లు ఉ్ననాయి.
