Telugu Titans : ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 2025లో దుమ్ములేపుతున్న తెలుగు టైటాన్స్.. వరుసగా ఐదో విజయం..
ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 2025లో తెలుగు టైటాన్స్ (Telugu Titans ) అదరగొడుతోంది.

Telugu Titans win 5 consecutive matches in PKL 2025
Telugu Titans : ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 2025లో తెలుగు టైటాన్స్ అదరగొడుతోంది. ఈ సీజన్‌లో వరుసగా ఐదో మ్యాచ్‌లోనూ విజయాన్ని నమోదు చేసింది. బుధవారం హర్యానా స్టీలర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 46-29 తేడాతో విజయాన్ని సాధించింది. భరత్ 20 పాయింట్లతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కెప్టెన్ విజయ్ మాలిక్ 8 పాయింట్లతో సత్తా చాటాడు.
మ్యాచ్ ఆరంభమైనప్పటి నుంచే తెలుగు టైటాన్స్ (Telugu Titans) జోరు ప్రదర్శించింది. తొలి అర్థభాగంలోనే హర్యానాను రెండు సార్లు ఆలౌట్ చేసింది. ఈ క్రమంలో ఫస్టాఫ్ ముగిసే సమయానికి 26-16 ఆధిక్యంలోని దూసుకెళ్లింది.
ఇక రెండో అర్థభాగంలోనూ టైటాన్స్ అదే జోరును కొనసాగించింది. మరోసారి హర్యానాను ఆలౌట్ చేసింది. ఆధిక్యాన్ని కొనసాగిస్తూ వచ్చిన తెలుగు టైటాన్స్ విజేతగా నిలిచింది.
ఈ విజయంతో పాయింట్ల పట్టికలో టైటాన్స్ మూడో స్థానానికి చేరుకుంది. ఇప్పటి వరకు ఈ సీజన్‌లో టైటాన్స్ 13 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 8 మ్యాచ్‌ల్లో విజయాన్ని సాధించింది.