తొలి టెస్ట్ మనదే: బూమ్రా మ్యాజిక్.. భారత్ ఘనవిజయం

వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో టీమిండియా అధ్బుతంగా రాణించింది. తొలి టెస్ట్‌లో వెస్టిండీస్‌ను 318 పరుగుల భారీ తేడాతో ఓడించింది. రహానె (102) సెంచరీ చేసి జట్టుకు బలం చేకూర్చగా.. బుమ్రా 5వికెట్లు తీసుకుని విండీస్ టీమ్ ని కోలకోలేకుండా చేశాడు. దీంతో భారత క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా నాలుగో భారీ విజయాన్ని దక్కించుకుంది టీమిండియా.
టీమిండియా నిర్దేశించిన 419 పరుగుల లక్ష్యం ఛేదించే క్రమంలో వెస్టిండీస్ రెండవ ఇన్నింగ్స్‌లో 26.5 ఓవర్లలో 100 పరుగులకే ఆలౌటైంది. బుమ్రా (5/7) విజృంభించగా.. ఇషాంత్ (3/31), షమి (2/13) లు రాణించగా.. విండీస్ బ్యాట్స్ మెన్లు వరుసగా పెవీలియన్ చేరారు. ఇక భారత్ రెండో ఇన్నింగ్స్‌లో రహానెకు తోడు హనుమ విహారి(93) హాఫ్ సెంచరీతో రాణించాడు.
తొలి ఇన్నింగ్స్‌లో ఇషాంత్(5 వికెట్లు) విజృంభించగా.. ఈసారి బుమ్రా వంతయ్యింది. కేవలం 7 పరుగులే ఇచ్చిన బుమ్రా 5 వికెట్లు పడగొట్టడంతో రెండు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో భారత్ నిలిచింది.